Tirumala: తిరుమల శ్రీవారికి 160 కిలోల బంగారం సమర్పించనున్న భక్తుడు..!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు అద్భుతమైన కానుక సమర్పించనున్నారు. శ్రీవారికి 160 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 160 కిలోల పసిడి ఆభరణాల విలువ దాదాపు రూ. 250 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ 26న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఆభరణాలను టీటీడీకి అందజేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఆభరణాలను తొమ్మిది సెట్లుగా, మొత్తం 45 రకాలుగా తయారు చేయించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారికి భక్తులు బంగారం, వజ్రాలు, నగదు రూపంలో భారీ విరాళాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒకే భక్తుడు ఏకంగా 160 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనుండటం చర్చకు దారి తీసింది.
ఈ విరాళం తిరుమల చరిత్రలోని భారీ కానుకల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ భారీ విరాళం ఎవరు ఇస్తున్నారు అనేది తెలియరాదు. నవంబర్ 26న ఏపీ ముఖ్యమంత్రి లేదా టీటీడీ పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. అటు తిరుమలలో నిత్య అన్నదానం భ్రమండంగా కొనసాగుతోంది. వెంగమాంబ అన్నప్రసాద ట్రస్టుకు భక్తుల నుంచి ఆరు నెలల కాలంలో రూ. 180 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే సగటున రోజుకు కోటి రూపాయలు ఈ ఒక్క ట్రస్టుకే భక్తులు విరాళంగా ఇచ్చారు. శ్రీనివాసుడి సమక్షంలో అన్నదానం అన్నది గొప్ప పుణ్యకార్యక్రమం కావడంతో చాలా మంది తోచినంత సాయం చేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ ట్రస్టు వద్ద రూ.2,300 కోట్లు డిపాజిట్లు రూపంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం మీద వచ్చే వడ్డీతోనే ప్రస్తుతం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 1985లో అన్నదాన కార్యక్రమం తిరుమలలో ప్రారంభించగా 1994లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మారి సేవలందిస్తోంది. వెంగమాంబ భవనంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, బయట ఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా అన్నప్రసాదాలు అందిస్తున్నారు. త్వరలో టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ రోజువారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకోసం శ్రీవాణిట్రస్టు నిధులను వినియోగించుకోనున్నారు. ఏ భక్తుడైనా కట్టుబట్టలతో తిరుమలకు వచ్చినా ఇక్కడే ఉండవచ్చు. నిత్యం ఆ స్వామి దర్శనం చేసుకుని వెంగమాంబ అన్నప్రసాద హాల్లలో భోజనం చేయవచ్చు. అలాగే శ్రీనివాసుడి సేవ చేసుకోవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications