స్కూల్ లైఫ్ తరువాత ఇంటర్ అనేది మన భవిష్యత్తులో కీలకం. అయితే ఇంటర్ ఫెలైతే ఫ్యూచర్ ఉండదు అని చాల మంది చెబుతుంటారు. కానీ పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు ఒక వ్యక్తి. నేటి కాలంలో హార్డ్ వర్క్, పట్టుదలతో విజయం సాధించిన వారు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంటర్ విఫలమైన తర్వాత కూడా గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి సక్సెస్ స్టోరీ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అతను 12వ తరగతిలో ఫెయిలయ్యాక ఇంట్లో వాళ్ళు, కుటుంబసభ్యులు, బంధువులు ఎంతగానో వెక్కిరించినా కూడా పట్టు వదలకుండా ఈరోజు సక్సెస్ ఫుల్ వ్యాపారిగా మారాడు. అంతేకాదు అతని కంపెనీ అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కూడా లిస్ట్ అయ్యింది.

అతని పేరు గిరీష్ మాతృభూతం. గిరీష్ 12వ తరగతి పరీక్షలో ఫెయిల్ కావడంతో అతని బంధువులు, స్నేహితులు రిక్షా తొక్కుతావా అంటూ సరదాగా హేళన చేసేవారు. ఇదంతా వింటూ చదువును కొనసాగించి చివరకు హెచ్‌సిఎల్‌లో ఉద్యోగం సాధించి విజయం సక్సెస్ అయ్యాడు. తరువాత అతను సాఫ్ట్‌వేర్ కంపెనీ జోహోలో లీడ్ ఇంజనీర్‌గా పనిచేసారు.
రూ.53,000 కోట్ల విలువైన
గిరీష్ మాతృభూతం కంపెనీ పేరు 'ఫ్రెష్‌వర్క్స్', ఈ కంపెనీ ఐటీ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. నేడు ఈ కంపెనీ విలువ రూ.53000 కోట్లు. గిరీష్ 2010లో జోహోలో జాబ్ మానేసి ఫ్రెష్‌వర్క్స్‌ను స్టార్ట్ చేసాడు. 2018 నాటికి కంపెనీకి 125 దేశాలలో 100,000 కంటే ఎక్కువ మంది క్లయింట్‌లు ఉన్నారు. గిరీష్ కి ప్రస్తుతం ఫ్రెష్‌వర్క్స్‌లో 5.229 శాతం వాటా ఉంది, వీటి మొత్తం విలువ దాదాపు రూ. 2,369 కోట్లు.
7 రోజుల్లో రూ. 340 కోట్లు సంపాదన
గిరీష్ గత వారంలో ఫ్రెష్‌వర్క్స్ లో అతనికి ఉన్న షేర్లను విక్రయించారు. 7 రోజుల్లో మొత్తం $39.6 మిలియన్ షేర్లను విక్రయించగా వీటి విలువ దాదాపు రూ. 336.41 కోట్లకు సమానం. దీని ప్రకారం.. వారం రోజుల్లో రూ.336 కోట్లకు పైగా సంపాదించాడు. దీనితో పాటు SaaS పరిశ్రమలో ప్రముఖ పేరుగా మారిన ఫ్రెష్‌వర్క్స్‌తో గిరీష్ SaaS (సాఫ్ట్‌వేర్ సర్వీస్) వ్యాపారంలోకి ప్రవేశించారు.
SaaS వ్యాపారం అంటే ఏమిటి?
SaaS గురించి మాట్లాడితే ఈ కంపెనీలు కస్టమర్లకు ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేయడానికి బదులుగా కస్టమర్‌లు ఈ సొల్యూషన్‌లను ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు. ఈ సబ్‌స్క్రిప్షన్ చాలా రకాల సౌకర్యాలను అందిస్తుంది, దీని వల్ల సాఫ్ట్‌వేర్ బిజినెస్ మరింత ఈజీ చేస్తుంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications