ఆగస్ట్ 10న హెచ్ డీఎఫ్ సీ యూపీఐ సేవలు మూడు గంటలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ ముఖ్యమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా UPI సేవలు ఆగస్ట్ 10, 2024న మూడు గంటల పాటు అందుబాటులో ఉండవని బ్యాంకు ప్రకటించింది. యూపీఐ సేవల కోసం ఈ షెడ్యూల్ చేయబడిన డౌన్‌టైమ్ గురించి తెలియజేస్తూ బ్యాంక్ కస్టమర్‌లకు ఇమెయిల్ పంపింది. ఇమెయిల్ కమ్యూనికేషన్ ప్రకారం ఆగస్టు 10, 2024న తెల్లవారుజాము 02:30 గంటల నుంచి తెల్లవారుజాము 05:30 గంటలకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు.
ఈ సమయంలో HDFC బ్యాంక్ కరెంట్ & సేవింగ్స్ ఖాతా (CASA) హోల్డర్‌లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు.
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, Gpay, WhatsApp Pay, PayTM, శ్రీరామ్ ఫైనాన్స్, Mobikwikలో HDFC బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కూడా అందుబాటులో ఉండవు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్‌లో UPI పరిమితి 24 గంటల్లో ఒకరి నుంచి ఒకరికి రూ. 1 లక్ష లేదా 20 లావాదేవీలుగా ఉంది. గురువారం
యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుల యూపీఐ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంతో పెద్ద మొత్తంలో టాక్స్ చెల్లించేవారు బెనిఫిట్స్ పొందనున్నారు.
ఆస్పత్రులు, విద్య సంస్థల్లో యూపీఐ చెల్లింపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు గతంలోనే పెంచింది. ఎన్పీసీఐ (NPCI) ప్రకారం సాధారణ యూపీఐ కోసం లావాదేవీ పరిమితి రూ.1 లక్ష వరకు ఉంటుంది. యూపీఐలో క్యాపిటల్ మార్కెట్‌లు, కలెక్షన్‌లు, బీమా, విదేశీ ఇన్‌వార్డ్ రెమిటెన్‌లు వంటి కొన్ని నిర్దిష్ట వర్గాల లావాదేవీల కోసం లావాదేవీ పరిమితి 2 లక్షల వరకు ఉంది.


Click it and Unblock the Notifications