బందన్ బ్యాంక్ లో 3 శాతం వాటాను ప్రముఖ హెచ్‌డీఎఫ్‌సీ ( హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ) విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది బ్లాక్ డీల్ ద్వారా జరిగినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. దాదాపు 5కోట్ల షేర్లు బ్లాక్ డీల్‌లో చేతులు మారినట్లు పేర్కొంది. దీంతో బందన్ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ వాటా తగ్గిపోయింది.
మోర్టగేజ్ రుణ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్.. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లిమిటెడ్ విలీనం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ సంస్థలు ప్రకటించాయి. దీనికి ఆర్బీఐ, సెబీ, సీసీఐ సహా ఇతర నియంత్రణా సంస్ధలు కూడా అనుమతులు ఇచ్చాయి. విలీన ప్రకటన తర్వాత బంధన్ బ్యాంకులో వాటాను విక్రయించాల్సి వచ్చిందని మార్గెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డీల్ పై హెచ్‌డీఎఫ్‌సీ స్పందించాల్సి ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ నుంచి బంధన్ బ్యాంకులో ఉన్న వాటాను ఎవరు కొనుగోలు చేశారు. ఎవరికి విక్రయించిందనే దానిపై వివరాలు రావాల్సి ఉంది. డిసెంబర్ 31, 2021 నాటికి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ బంధన్ బ్యాంకులో 9.89 శాతం వాటాతో 15.93 కోట్ల షేర్లను కలిగి ఉంది. తాజాగా దాంట్లో 3 శాతం వాటాను విక్రయించినట్లు సమాచారం. హెచ్‌డీఎఫ్‌సీ తన వాటాను విక్రయించడంతో బంధన్ బ్యాంక్ షేర్ ఎగబాకింది. బీఎస్సీ, నిప్టీలో 3.66 శాతం పెరిగి రూ. 327.20 ట్రేడ్ అయింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications