2020 క్యాలెండర్ ఇయర్‌లో టాప్ 10 రుణదాతల జాబితాలో HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, SBI, యస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, HSBC బ్యాంకు నిలిచాయి. వ్యాలెట్లలో గూగుల్ పే, ఫోన్ పే ముందు ఉన్నాయి. BFSI(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్) మూవర్స్ అండ్ షేకర్స్ 2020 పేరుతో విజీకి ఓ నివేదిక రూపొందించింది. ఇందులో భారత్‌లోని అగ్రశ్రేణి 100 బ్యాంకులు, వర్ధమాన BFSI నమూనాలు అయిన వ్యాలెట్లు, యూపీఏ, నియో బ్యాంక్స్, ఎన్బీఎఫ్‌సీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంక్స్‌ను ప్రస్తావించింది.

ఇవి టాప్..
HDFC, ICICI బ్యాంకు, SBI, యస్ బ్యాంకు, PNB, HSBC, కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాయిష్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులు టాప్ 10లో నిలిచాయి.2020లో కరోనా కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో యూపీఐ, వ్యాలెట్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగాయి. ఇందులో గూగుల్ పే ముందు నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో ఫోన్ పే ఉంది. వాట్సాప్ పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించినప్పటికీ ఇతర పేమెంట్స్ సేవా సంస్థలతో వెనుకే ఉంది.

కరోనా సమయంలో కీలకంగా..
భారతీయ వినియోగదారుడికి సేవలు అందించడం కోసం ICICI, HDFC, SBI బ్యాంకులు కొన్ని మార్పులు చేర్పులు చేశాయి. కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులు కూడా అధే బాటలో పయనించాయి. యోనో ముందు నిలిచింది. నియో, కొటక్ 811 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు ప్రాథమిక మూలధన వనరుగా ఎన్బీఎఫ్‌సీలు కీలకంగా ఉన్నాయి. కరోనా సమయంలో ఈ బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి.

ఈ బ్యాంకులు మంచి పోటీ
డీహెచ్ఎఫ్ఎల్ మొత్తం మీద 15వ ర్యాంకులోను, విభాగ ర్యాకులో అగ్రస్థానంలో నిలిచింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మంచి పోటీని కనబరిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications