For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు

|

ప్రయివేటురంగ దిగ్గజం HDFC లిమిటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీరేట్లను పెంచింది. 33 నుండి 99 నెలల కాలపరిమితిలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. వీటిని మార్చి 30వ తేదీ నుండి అమలులోకి తెచ్చింది. ఒక బేసిస్ పాయింట్ అంటే 0.01 శాతం. 33 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు 6.2 శాతం రిటర్న్స్ ఇస్తుంది. 66 నుండి 99 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ యాన్యువల్ రిటర్న్స్ 6.5 శాతం నుండి 6.65 శాతంగా ఉన్నాయి.

సీనియర్ సిటిజన్స్ అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును పొందుతారు. ఓ వైపు ఫిక్స్డ్ డిపాజిట్లు తగ్గుతున్న సమయంలో HDFC వీటిని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2018 అక్టోబర్ తర్వాత HDFC లిమిటెడ్ FD వడ్డీ రేట్లు పెంచడం ఇదే మొదటిసారి.

HDFC hikes fixed deposit rates by up to 25 bps from 30 March

కరోనా నేపథ్యంలో ఇటీవల NBFCలు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే బజాజ్ క్యాపిటల్ మాత్రం 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలానికి 5.4 శాతం కాగా, ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది.

English summary

HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పెంపు | HDFC hikes fixed deposit rates by up to 25 bps from 30 March

Mortgage lender HDFC Ltd has increased rates on its AAA-rated fixed deposits (FDs) with maturity between of 33 and 99 months by 25 basis points, effective 30 March. One basis point is 0.01%.
Story first published: Friday, April 2, 2021, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X