దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు ఖాతాదారులు HDFC బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని రుణాలపై ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. HDFC బ్యాంక్ బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR) రేట్లను 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది.
ఈ పెరిగిన రేట్లు సెప్టెంబర్ 7 నుండి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ మొదలైన వాటిపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌లో 15 బిపిఎస్ పెరిగిన తర్వాత, అది 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల MCLR 0.10 శాతం పెరిగింది. ఇది 8.45 శాతం నుండి 8.55 శాతానికి పెరిగింది.

మూడు నెలల ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.95 శాతం నుంచి 9.05 శాతానికి తగ్గింది. ఒక సంవత్సరం MCLRతో రుణం తీసుకున్న వినియోగదారుల రుణాలకు, MCLR 5 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇది 9.10 శాతం నుంచి 9.15 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఒక సంవత్సరం, రెండేళ్లకు 0.05 శాతం MCLR పెంచింది. ఇది 9.20 శాతం నుండి 9.20 శాతానికి పెరిగింది.
MCLR లేదా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ 2016లో భారతదేశ బ్యాంకింగ్ రెగ్యులేటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. MCLR ఇప్పుడు క్రెడిట్, గృహ రుణాలను అందించడానికి బ్యాంకుల అంతర్గత ప్రమాణంగా అమలు చేస్తారు. దీనిని ఫ్లోటింగ్ వడ్డీ రేటు విధానం అని కూడా పిలుస్తారు. గృహ కొనుగోలుదారులు తీసుకున్న గృహ రుణ EMIకి MCLR నేరుగా లింక్ చేసి ఉంటుంది. అందువల్ల, MCLR పెరుగుదలతో, బ్యాంకు రుణాలు ఖరీదైనవిగా మారుతాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications