ఆ వివరాలు ఇవ్వడంలో జాప్యం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుపై ఆర్బీఐకి ఫిర్యాదు!
ప్రభుత్వరంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుండి సమాచారం రావడంలో జాప్యం ఏర్పడుతోందని దేశీయ అతిపెద్ద క్రెడిట్ బ్యూరోస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ దేశంలో రెండోఅతిపెద్ద రుణదాత. లక్షలాదిమంది రిటైల్ రుణగ్రహీతల రీపేమెంట్ స్థితితో సహా రుణాల వివరాలను అందించడంలో ఆలస్యం జరిగిందని ఎక్స్‌పీరియన్స్ పీఎల్‌సీ లోకల్ యూనిట్.. కేంద్రబ్యాంకుకు జూలైలో ఫిర్యాదు చేసింది. రుణాలకు సంబంధించిన కాలపరిమితి, పొడిగింపు వివరాల్లో చాలాకాలంగా జాప్యం జరుగుతోందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఆ సంక్షోభం గుర్తుందిగా..: లోన్ మారటోరియంపై రఘురాం రాజన్ హెచ్చరిక

అందుకే క్రెడిట్ బ్యూరో
రుణగ్రహీతల క్రెడిట్ విలువను అంచనా వేసేందుకు భారతీయ బ్యాంకులు ఎక్స్‌రీకిన్ వంటి క్రెడిట్ బ్యూరోల నుండి వచ్చిన డేటా పైన ఆధారపడతాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి వంటి ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు, ఎన్పీఏలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు రుణగ్రహీతలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్‌పీరియన్, మరో మూడు క్రెడిట్ బ్యూరోలకు నెలవారీ ప్రాతిపదికన ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు స్పందన
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రతినిధి మాట్లాడుతూ సమాచారం అందించడంలో ఎలాంటి ఆలస్యం కాలేదని, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు... క్రెడిట్ బ్యూరోలకు ఎప్పటికి అప్పుడు సమాచారాన్ని అందిస్తోందని చెప్పారు. జాప్యం జరుగుతోందనే అంశాన్ని ఖండించారు. 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యూరోలతో సమాచారాన్ని పంచుకుంటోంది' అని పేర్కొన్నారు.

మరో బ్యాంకుకు హెచ్చరికగా..
ఆర్బీఐ, బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోకు సంబంధించిన అంశం ఏదైనా కాన్ఫిడెన్షియల్. ఎక్స్‌పీరియన్.. ఆర్బీఐ నిర్దేశించిన ప్రేమ్ వర్క్‌లో 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (రెగ్యులేషన్) చట్టం ప్రకారం పని చేస్తుందని ప్రతినిధులు చెబుతున్నారు. దీనిపై కేంద్ర బ్యాంకు స్పందించాల్సి ఉందని చెబుతున్నారు.
క్రెడిట్ బ్యూరోలు దేశంలోని బ్యాంకులు తమ రుణాల రీపేమెంట్ స్టేటస్ వంటి వివరాలను రహస్య ప్రాతిపదికన పంచుకోవడానికి కేంద్రబిందువుగా పని చేస్తాయి. ఉదాహరణకు ఒక నిర్దిష్ట కార్పోరేట్ లేదా వ్యక్తిగత రుణగ్రహీత ఒక బ్యాంకుకు బకాయిలు పడితే, క్రెడిట్ బ్యూరో నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మరో బ్యాంకుకు హెచ్చరికగా పని చేస్తుంది.