Banking News: ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్‌గా HDFC తన కస్టమర్లకు సేవలందిస్తోంది. తాజాగా ఇటీవల ఓ కీలక ప్రకటన చేసింది. దీనివల్ల ఎంతో మంది ప్రభావితం కానున్నారు. తనకు కొంత మార్జిన్ తగ్గినా వినియోగదారులకు బెనిఫిట్ అందించాలని చూస్తోంది.
HDFC బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వారు ఈ వార్త వింటే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే కొత్తగా రుణాలు తీసుకుంటున్న, ఇప్పటికే లోన్ పొందిన వారిపై కొంత భారాన్ని తగ్గించాలని బ్యాంక్ భావిస్తోంది. రుణాలపై వడ్డీరేట్లను సవరించాలని చూస్తోంది. MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లు) దిగిరావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

MCLR రేట్లు 8.95 శాతం నుంచి 9.35 శాతం మధ్య కొనసాగుతున్నాయి. అయితే రెండేళ్ల కాలానికి లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు HDFC వెల్లడించింది. కాగా ఇతర రుణ రేట్లు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని పేర్కొంది. జూన్ 7 నుంచి తగ్గిన రేట్లు అమలు చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. రుణగ్రహీతలందరికీ దీనివల్ల కొంత మేర ఊరట కలగనున్నట్లు తెలుస్తోంది.
బ్యాంకులు MCLR కంటే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వవు. కాబట్టి దాన్ని కనీస వడ్డీ రేటుగా భావించవచ్చు. హోం లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు పొందిన వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారీ మొత్తంలో చెల్లించాల్సిన EMI భారం కొంత తగ్గుతుంది. తద్వారా అదికాస్తా తొందరగా పూర్తి అవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications