HDFC Fund Defence Fund: మూడేళ్లలో 39.7 శాతం రాబడి ఇచ్చిన హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్..
హెచ్ఎఫ్సీ డిఫెన్స్ ఫండ్ ప్రస్తుతం థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ విభాగంలో అధిక రాబడి ఇచ్చిన ఫండ్ గా ఉంది. ఈ ఫండ్ ఆరు నెలల కాలంలో 24.2 శాతం రాబడి ఇచ్చింది. HDFC డిఫెన్స్ ఫండ్ రూ. 10,709.2 కోట్ల అతిపెద్ద కార్పస్‌ను కలిగి ఉంది. ఒక సంవత్సరం కాలంలో బెంచ్‌మార్క్ 0.9% రాబడిని ఇవ్వగా, HDFC డిఫెన్స్ ఫండ్ దాని బెంచ్‌మార్క్ కంటే 30.9 శాతం పాయింట్లు అధిక రాబడి ఇచ్చింది. మూడు సంవత్సరాల కాలంలో కూడా బెంచ్‌మార్క్ 9.2% రాబడిని ఇవ్వగా.. ఇది దాని బెంచ్‌మార్క్ కంటే 30.5 శాతం పాయింట్లు ఎక్కువ రాబడి ఇచ్చింది. ఒక నెలలో హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ కూడా 13.3 శాతం రాబడితో అగ్రస్థానంలో ఉంది.
మూడేళ్ల ప్రాతిపదికన చూస్తే హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ 39.7 శాతం రాబడితో అగ్రస్థానంలో ఉంది. థీమాటిక్ ఫండ్‌లు ఒకే మార్కెట్-క్యాప్ విభాగానికి బదులుగా ఒక నిర్దిష్ట పెట్టుబడి థీమ్ చుట్టూ పెట్టుబడి పెడతాయి. అందువల్ల వాటి రాబడులు వైవిధ్యభరితమైన ఈక్విటీ కేటగిరీల రాబడుల నుంచి గణనీయంగా భిన్నంగా ఉండవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్, జూలైలో తన పోర్ట్‌ఫోలియోలో కొచ్చిన్ షిప్‌యార్డ్, ఇండో-మిమ్‌లను కొత్తగా చేర్చుకుంది. అదే కాలంలో హెచ్‌ఏఎల్, మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, మరో ఐదు స్టాక్‌లలో తన వాటాను పెంచుకుంది. రక్షణ రంగానికి చెందిన ఈ ఫండ్ జూలై నెలలో రూ. 42 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కొచ్చిన్ షిప్‌యార్డ్ కు చెందిన 3 లక్షల షేర్లను, రూ. 25 కోట్ల మార్కెట్ విలువ కలిగిన INDO-MIMకి చెందిన దాదాపు 3.30 లక్షల షేర్లను తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంది.

ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ పోర్ట్ ఫోలియోలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 14.86 శాతం, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ 14.56 శాతం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 11.34 శాతం, సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ 11.33 శాతం, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 6.89 శాతం, MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ 5.43 శాతం, BEML లిమిటెడ్ 4.85 శాతం, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 4.22 శాతం, ఐషర్ మోటార్స్ లిమిటెడ్ 3.70 శాతం, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ 3.57 శాతం ఉంది. ఈ ఫండ్ ఏఎంయూ రూ.10,709 కోట్లుగా ఉంది.
ఈ కేటగిరిలో మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్, యాక్సిస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ ఉన్నాయి. ఈ మూడు ఫండ్లు ఇండెక్స్ ను ట్రాక్ చేస్తాయి. కానీ హెచ్‌డిఎఫ్‌సి డిఫెన్స్ ఫండ్ ఇండెక్స్ ట్రాక్ చేయదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications