చిన్న కంపెనీలకు మద్దతు కోసం మరో సంస్థతో HDFC బ్యాంకు జట్టు
స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(MSME) రంగానికి రుణ తోడ్పాటు అందించేందుకు నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSCI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు HDFC బ్యాంకు తెలిపింది. దేశవ్యాప్తంగా MSME ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు ఇందుకు తోడ్పాటును అందిస్తాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని HDFC బ్యాంకు కమర్షియల్ అండ్ రూరల్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా తెలిపారు. NSIC నుండి వచ్చిన రుణ దరఖాస్తులను స్వీకరించి, అర్హత ఆధారంగా బ్యాంకు రుణాలను మంజూరు చేస్తుంది.
ఈ భాగస్వామ్యంతో పాటు HDFC బ్యాంకు ఇప్పటికే ఎంఎస్ఎంఈలలో పోటీతత్వాన్ని పెంచేందుకు వివిధ పథకాలు అందిస్తోంది. ఈ ఫైనాన్సింగ్ అరేంజ్ కింద HDFC బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న MSME ప్రాజెక్టులకు లేదా ఇతర పారిశ్రామిక రంగాలకు మద్దతునిస్తాయి. ఇప్పుడు NSCIతో HDFC ఒప్పందం కుదుర్చుకుంది. MoU పైన NSCI డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ గౌరవ్ దీక్షిత్, HDFC సేల్స్ ఎక్సలెన్స్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ నేషనల్ హెడ్ అఖిలేష్ కుమార్ రాయ్ సంతకాలు చేశారు.

బ్యాంకు ఏం చేస్తుంది?
NSIC ఫార్వార్డ్ చేసిన రుణ దరఖాస్తును యాక్సెప్ట్ చేస్తుంది HDFC బ్యాంకు. మెరిట్ ఆధారంగా రుణాన్ని సాంక్షన్ చేసే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. బ్యాంకు రుణ నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేయడాన్ని పరిగణిస్తుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లోని MSME రంగానికి చెందిన ఫైనాన్సింగ్ ప్రాజెక్టులు ఉన్న చోట HDFC బ్యాంకు శాఖలు ఉంటే వాటి ద్వారా మద్దతు ఉంటుంది.
NSICతో భాగస్వామ్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు రాహుల్ శుక్లా తెలిపారు. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో దేశానికి వెన్నుముక వంటి MSME రంగ వృద్ధికి అండగా ఉండేందుకు ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications