Home Loans: సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా లక్షల మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రెపో-లింక్డ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో వడ్డీ రేటు 8.70 శాతం నుంచి 9.8 శాతానికి చేరుకుంది. జూలై 1, 2023న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి విలీనం కారణంగా గృహ రుణ రేటులో మార్పు జరిగింది. ఇకపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్‌కి లింక్ చేయబడదని బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. కొత్త రెపో లింక్డ్ వడ్డీ రేటు కొత్త కస్టమర్లకు వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే పాత కస్టమర్లు RPLRతో కొనసాగవచ్చని తెలుస్తోంది.
రిజర్వు బ్యాంక్ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగనున్న తరుణంలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటనను బ్యాంక్ వెల్లడించింది. ఇది 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరంలో మొదటి సమావేశం కావటంతో చాలా మంది వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దేశంలో మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం అయిన ఐసిఐసిఐ ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేట్లు 9 శాతం నుంచి 10.05 శాతం మధ్య ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ రేట్లు 9.15 శాతం నుంచి గరిష్టంగా 10.05 శాతం వరకు ఉన్నాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు 8.75 నుంచి 9.65 శాతం వరకు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్ ప్రారంభ వడ్డీ రేటు 8.70 శాతంగా కొనసాగుతున్నాయి.
2024-25 కొత్త ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య విధాన కమిటీ ద్వైమాసిక సమావేశాల షెడ్యూల్‌ను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. తొలి సమావేశం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరగనుంది. తదుపరి సమావేశం జూన్ 5న ప్రారంభం కాగా ద్రవ్య సమీక్ష జూన్ 7న ప్రకటించబడుతుంది. తదుపరి సమావేశం ఆగస్టు 6 నుంచి 8 వరకు, అక్టోబర్ 7 నుంచి 9 వరకు, డిసెంబర్ 4 నుంచి 6 వరకు చివరి సమావేశం ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరుగుతుంది.


Click it and Unblock the Notifications