ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ప్రకారం రూ.50 లక్షల లోపు బ్యాలెన్స్ కలిగిన సేవింగ్స్ ఖాతాలకు 3 శాతం, రూ.50 లక్షలకు పైన బ్యాలెన్స్ ఉంటే అలాంటి సేవింగ్స్ ఖాతాలకు 3.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 6, 2022 నుండి అమలు కానున్నాయి.
డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ డిపాజిట్లతో సహా అన్ని సేవింగ్స్ ఖాతాలకు ఏప్రిల్ 6, 2022 నుండి ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయని తెలిపింది. బ్యాంకు ఖాతాదారు ఖాతాలో నిర్వహించే రోజువారీ నిల్వల ఆధారంగా వడ్డీని లెక్కించి మూడు నెలలకు ఓసారి వడ్డీ మొత్తాన్ని జమ చేస్తారు.
కేవలం సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచింది HDFC బ్యాంకు. FD వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్ల మేరకు పెంచింది. ఏడాది కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఇప్పటి వరకు ఉన్న 5 శాతం వడ్డీ రేటును 5.10 శాతానికి పెంచింది.

7 నుండి 14 రోజుల కాలపరిమితిపై 2.50 శాతం, 15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై 2.50 శాతం, 30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 3 శాతం, 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3 శాతం, 91 రోజుల నుండి ఆరు నెలల కాలపరిమితిపై 3.5 శాతం, ఆరు నెలల ఒక రోజు నుండి 9 నెలల కాలపరిమితిపై 4.4 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
అలాగే, 9 నెలల ఒక రోజు నుండి ఏడాది వరకు 4.4 శాతం, ఏడాది కాలపరిమితిపై 5.10 శాతం, ఏడాది ఒకరోజు నుండి రెండేళ్ల కాలపరిమితిపై 5.10 శాతం, రెండేళ్ల ఒకరోజు నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.20 శాతం, మూడేళ్ల ఒకరోజు నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 5.45 శాతం, అయిదేళ్ల ఒకరోజు నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.60 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications