Bank Jobs: HDFC బ్యాంక్ జాబ్ ఓపెనింగ్స్.. ఏకంగా రూ.12 లక్షలు శాలరీ, మిస్ కాకండి..
HDFC Bank Jobs: మార్కెట్లు ఎల్లప్పుడూ యువత స్థిరమైన ఉద్యోగాల కోసం వెతుకుతూనే ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల తర్వాత ప్రాముఖ్యత ఇచ్చే వాటిలో బ్యాంక్ జాబ్స్ ముందు స్థానంలో ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉండే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
తాజాగా బ్యాంక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికింద మెుత్తం 500 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అర్హత కలిగిన ఉద్యోగులు ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తుదారుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదని కంపెనీ తన జాబ్ నోటిఫికేషన్ లో వెల్లడించింది.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల విద్యార్హతలను పరిశీలిస్తే.. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్తులకో ఉత్తీర్ణత సాధించి ఉండాలని బ్యాంక్ ప్రకటించింది. అలాగే 1-10 ఏళ్ల మధ్య ఎక్స్ పీరియన్స్ ఉండాలని తెలిపింది. దీనికోసం ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని బ్యాంక్ పేర్కొంది. ముందుగా ఆన్లైన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది, దీనిలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తామని బ్యాంక్ తెలిపింది. ఎంపికైన ఉద్యోగులు దేశంలోని ప్రముఖ నగరాల్లో పనిచేయాల్సి వస్తుందని వెల్లడించింది.
దీనికోసం పరీక్షా కేంద్రాలు దేశంలో హైదరాబాద్, వైజాగ్, దిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కలకత్తాల్లో ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది. పరీక్ష కోసం దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7, 2025గా బ్యాంక్ ప్రకటించింది. అలాగే పరీక్ష మార్చి నెలలో ఉంటుందని వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం www.hdfcbank.com అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
ఇక వేతనాల విషయానికి వస్తే వార్షికంగా రూ.3 నుంచి రూ.12 లక్షల వరకు చెల్లించటానికి సిద్ధంగా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. మేనేజర్ స్థాయి ఉద్యోగులకు రిక్రూట్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేటు బ్యాంకు అందిస్తున్న సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులకు కొత్త ఏడాది ఇదొక సదవకాశంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications