HDFC Bank Q2 Results: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న హెచ్‌డిఎఫ్‌సి నేడు తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. రెండు కంపెనీల మెర్జర్ తర్వాత వస్తున్న మెుదటిసారి క్వార్టర్లీ రిజల్ట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఏడాది ప్రాతిపదికన పన్నుల తర్వాత నికర లాభం 50 శాతం పెరిగి రూ.15,976 కోట్లుగా నిలిచింది. ఇది మార్కెట్ నిపుణుల అంచనాలకు మించిన పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30 శాతం వృద్ధితో రూ.27,385 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే కాలంలో రూ.28,617 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం, బ్యాంక్ నికర రాబడి మెరుగుపడటం బ్యాంక్ నికర లాభం పెరగడానికి దోహదపడింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ నికర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 33.1 శాతం పెరిగి రూ.38,093 కోట్లకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆస్తులపై HDFC బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్లు 3.4 శాతంగా ఉన్నాయి. ఆస్తి నాణ్యతను పరిశీలిస్తే.. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 1.34 శాతానికి క్షీణించగా.. గడచిన త్రైమాసికంలో 1.17 శాతంగా ఉంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల NPA రూ.31,577.89 కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది.
అలాగే రిపోర్టింగ్ మాసంలో ప్రైవేట్ రంగ రుణదాత నికర ఎన్‌పీఏలు రూ.8,072.79 కోట్లుగా ఉండగా.. గత ఏడాది ఇదే కాలంలో రూ.4,882.67 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. స్థూల అడ్వాన్సులు రూ.23,54,633 కోట్లుగా ఉన్నాయి. CASA 37.6%గా ఉంది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు రూ.5,69,956 కోట్లు, కరెంట్ ఖాతా డిపాజిట్లు రూ.2,47,749 కోట్లు, టైమ్ డిపాజిట్లు రూ.13,55,153 కోట్లు ఉన్నాయి. ఇదే క్రమంలో క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.5%గా ఉంది. ఎన్ఎస్ఈలో మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.1,532 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications