HDFC Bank: Q1 లాభాలతో మతిపోగొడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. 30 శాతం అధికంగా..!!

HDFC Bank Q1 Results: ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కొత్త ఆర్థిక సంవత్సరంలో తన తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ క్యాప్ రికార్డు స్థాయిలకు చేరుకుంది.

జూలై 17న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.11,951 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ లాభం రూ.9,196 కోట్లుగా ఉంది. మార్కెట్ అంచనాలను మించి పనితీరు కనబరిచిన బ్యాంక్ నికర లాభం ఏకంగా 30 శాతం అధికంగా నమోదైంది. బ్రోకరేజీలు రూ.11,581 కోట్ల నికర లాభాన్ని అంచనా వేయగా.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మాత్రం అంతకు మించిన పనితీరును కనబరిచింది.

HDFC Bank Q1 results beats market estimates with 30 percent incraese in net profit

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం జూన్ 30, 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ.19,481 కోట్ల నుంచి 21.1 శాతం పెరిగి రూ.23,599 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) నిష్పత్తి 1.17 శాతంగా ఉంది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో 1.28 శాతం నుంచి మెరుగుపడింది. మంచి లాభాలను కంపెనీ నివేదించటంతో స్టాక్ మార్కెట్లలో షేర్ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో లాభపడింది.

బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.19.13 లక్షల కోట్లుగా ఉండగా.. ఏడాది ప్రాతిపదికన 19.2 శాతం పెరిగాయి. అలాగే CASA రేషియో 10.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం కరెంట్ ఖాతా డిపాజిట్లు రూ.2.52 లక్షల కోట్లు, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు రూ.5.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక టైమ్ డిపాజిట్లు రూ.11 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ నివేదించింది. బ్యాంక్ ఆదాయంలో సింహ భాగం రిటైల్ బ్యాంకింగ్ విభాగం నుంచి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+