అపోలో హాస్పిటల్స్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఖాతాదారులకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. ఇందులో భాగంగా అపోలో ఆసుపత్రుల్లో వైద్యానికి రూ.40 లక్షల వరకు రుణాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్లకు అందిస్తుంది. అవసర సమయంలో ఈ లోన్ మంజూరు చేస్తారు. అపోలో 24/7 డిజిటల్ ప్లాట్ ఫామ్ పైన డాక్టర్లు ఉచితంగా సంప్రదించవచ్చు.

కస్టమర్లకు ఎంతో ప్రయోజనం
చికిత్స విషయంలో తమ కస్టమర్లకు ప్రాధాన్యత ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సీఈవో, ఎండీ ఆదిత్యపురి అన్నారు. ఆరోగ్య, ఆర్థికరంగంపై ఈ భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపిస్తుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఉన్న 6.5 కోట్ల మంది కస్టమర్లకు ఇది ప్రయోజనమని అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని తెలిపారు.

ఈ సేవలు పొందవచ్చు
ఎలాంటి ఖర్చు లేకుండా అపోలో డాక్టర్స్‌తో ఫోన్‌లో సంప్రదింపులు, ఏడాది పాటు ఉచితంగా అపోలో సభ్యత్వం, ఇంటి వద్దకు మెడిసిన్స్ తెచ్చివ్వడం, వాట్సాప్ ఆధారిత వైద్య సేవలు, సమగ్ర ఆరోగ్య పరీక్షలతో పాటు నలభై లక్షల రూపాయల వరకు ఎలాంటి హామీలేని ముందస్తు ఆమోదిత పర్సనల్ లోన్ ఉంటుంది. పది నిమిషాల్లో రుణం విడుదల చేస్తారు. ఇందులో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ఆదిత్యపురి తెలిపారు.

బీమా కవరేజీలోకి రాకపోతే..
అందరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి అని, కొన్ని సందర్భాలలో బీమా కవరేజీలోకి వైద్య ఖర్చులు రాకపోవచ్చునని, అలాంటప్పుడు ఈ తరహా ఒప్పందాలు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వివిధ రకాల జబ్బుల బారిన పడిన రోగుల కోసం గతంలో తాము ప్రారంభించిన ది హెల్దీ లైఫ్ కార్యక్రమం ప్రయోజనాలను కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులు అందుకోవచ్చునని శోభన కామినేని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications