కరోనా మహమ్మారి బారిన పడిన కుటుంబాల్లోని పిల్లల చదువులకు HDFC బ్యాంకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. 2020 జనవరి తర్వాత కరోనా వల్ల తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన, జీవనోపాధి పోయిన కుటుంబాలలోని పిల్లలకు ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుండి రూ.75,000 వరకు అందిస్తోంది. ఈ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31, 2021. ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి చదివేవారికి, అలాగే యూజీ, పీజీ, డిప్లోమా కోర్స్ చేసేవారికి కూడా స్కాలర్‌షిప్ ప్రయోజనం ఉంది. ఇది వన్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం.

దరఖాస్తుకు ఎవరు అర్హులు?
- భారతీయ విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ ప్రయోజనం ఉంది.
- విద్యార్థి డిప్లోమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (జనరల్ ప్రొఫెషన్) లేదా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతుండాలి.
- జనవరి 2020 నుండి కరోనా వల్ల తల్లిదండ్రులు మృతి చెంది ఉంటే లేదా కుటుంబాన్ని పోషించే వారి ఉద్యోగం పోయి ఆధారం లేకుంటే ఈ స్కాలర్‌షిప్ పొందవచ్చు.
- స్కాలర్‌షిప్ పొందేవారి ఆదాయం సంవత్సర ఆదాయం రూ.6 లక్షలకు తక్కువగా ఉండాలి. అన్ని ఆదాయాలు కలిపి ఇంతకంటే తక్కువ ఉండాలి.
- HDFC బ్యాంకు ఉద్యోగుల పిల్లలు అలాగే, బడ్డీ4స్టడీ ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అనర్హులు.

ఎవరికి ఎంత?
- Class 1 to 5 చదివే విద్యార్థికి రూ.15,000
- Class 6 to 8 చదివే విద్యార్థికి రూ.18,000
- Class 9 to 12 చదివే విద్యార్థికి రూ.21,000
- Diploma courses - రూ.20,000
- Undergraduate (General - BCom, BSc, BA, BCA, etc.) courses - రూ.30,000
- Postgraduate (MCom, MA, etc.) courses - రూ.35,000
- undergraduate (Professional - BTech, MBBS, LLB, BArch, Nursing) courses - రూ.50,000
- Postgraduate (MTech, MBA) courses - రూ.55,000 - రూ.75,000

షరతులు.. డాక్యుమెంట్స్
- ఈ స్కాలర్‌షిప్‌ను తప్పనిసరిగా అకడమిక్ ఖర్చుల కోసం మాత్రమే వినియోగించాలి. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఫుడ్, ఇంటర్నెట్, ఆన్‌లైన్ లెర్నింగ్ డివైస్, బుక్స్, స్టేషనరీ.. తదితరాలకు ఉపయోగించవచ్చు.
- అంతకుముందు చదివిన సంవత్సరం మార్క్ షీట్. 2019-20 మార్క్ షీట్ అందుబాటులో లేకుంటే 2018-19కి సంబంధించిన మార్క్ షీట్ అప్ లోడ్ చేయాలి.
- ఆధార్ కార్డు, వోడర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు.
- ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్. ఉదాహరణకు ఫీజు రిసిప్ట్, అడ్మిషన్ లెటర్, ఇనిస్టిట్యూషన్ ఐడీ కార్డు, బోనాఫైడ్ సర్టిఫికెట్.
- క్రైసిస్ డాక్యుమెంట్. అంటే మరణ ధృవీకరణ పత్రం లేదా ఉద్యోగం పోయిన ఆధారం.
- క్రైసిస్ తెలిసిన ఇద్దరు వ్యక్తుల రిఫరెన్స్. స్కూల్ టీచర్, డాక్టర్, హెడ్ ఆఫ్ స్కూల్, గవర్నమెంట్ ఆఫీసర్ తదితరులు.
- అప్లికెంట్ (లేదంటే పేరెంట్) బ్యాంకు అకౌంట్ వివరాలు.
- ఫోటోలు
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications