హెచ్‌డిఎఫ్‌సీ యూపీఐ వినియోగదారులకు బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. యూపీఐ లావాదేవీలకు సంబంధించి హెచ్‌డిఎప్‌సీ బ్యాంక్ ఓ కీలక ప్రకటన జారీ చేసింది. ఇకనుంచి హెచ్‌డిఎఫ్‌సి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు అని తేల్చి చేప్పేసింది. రూ. 100 లోపు యూపీఐ చెల్లింపులకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపించబోమని హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ స్పష్టం చేసింది. కేవలం ఈ మెయిల్‌కు మాత్రమే నోటిఫికేషన్స్ పంపించడం జరుగుతుందని పేర్కొంది.
ఇకనుంచి రూ.100 లోపు యూపీఐ చెల్లింపులకు ఎస్ఎంఎస్ అలర్ట్ లను నిలిపివేస్తున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. ఇక, ఈ మార్పు వచ్చే నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ వివరించింది. రూ .100 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్స్ జరిపినా, యూపీఐ ద్వారా రూ .500 కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటేనే ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయని హెచ్‌డిఎఫ్సి బ్యాంక్ తెలిపింది. రూ. 100లోపు యూపీఐ చెల్లింపులు జరిపిన వారికి ఎటువంటి మెసెజ్‌లు రావని, మెయిల్ ద్వారా మాత్రమే నోటిఫికేషన్ పంపడం జరుగుతుందని తెలిపింది. ఇందుకోసం వినియోగదారులు తమ ఈ మెయిల్ ఐడీ లను అప్ డేట్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది. యూపీఐ లావాదేవీల సగటు విలువ తగ్గుముఖం పట్టడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్...
చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్స్‌కు ఎస్ఎంఎస్ అలర్ట్స్అవసరం లేదని వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో రూ. 100 ట్రాన్సాక్షన్స్ రూ. 500 లోపు యూపీఐ డిపాజిట్లకు ఎలాంటి మెసెజ్‌లు రావని బ్యాంక్ వివరించింది. అయితే, కస్టమర్లు ఏమాత్రం కంగారుపడొద్దని ఈ ట్రాన్సాక్షన్స్ంటికీ ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ పంపిస్తామని తెలిపింది. దీనికోసం వినియోగదారులు చేయాల్సిన పని ఏంటటే.. బ్యాంక్‌లకు గతంలో ఇచ్చిన తమ ఈ మెయిల్ ఐడీలు యాక్టివ్ గా ఉన్నాయో లేవో ఒక్కసారి చూసుకోవాలని, లేని పక్షంలో తమ ఈ మెయిల్ లను అప్ డేట్ చేసుకోవాలని బ్యాంక్ కోరింది.


Click it and Unblock the Notifications