HDFC Bank MCLR Rate Hike: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ లెండర్ HDFC బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించింది. దీని కారణంగా లోన్లు తీసుకున్న కస్టమర్లు ఇకపై ఎక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్ లో అందించిన వివరాల ప్రకారం.. HDFC బ్యాంక్ కొత్త MCLR రేట్లు జూలై 7 అంటే ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. గత నెల రిజర్వు బ్యాంక్ రెపో రేటు పెంచిన కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ రేటు పెంపు వల్ల కొత్త , ఇప్పటికే ఉన్న రుణగ్రహీతల వడ్డీలు పెరుగుతాయి. ఇందులో హోమ్ లోన్, వెహికల్ లోన్ తో పాటు ఇతర రకాల లోన్స్ ఈఎంఐలు పెరగనున్నాయి. ఎంసీఎల్ఆర్ రేట్లు పెంపు ఏఏ కాలపరిమితులకు ఎలా ఉందంటే..

ఓవర్ నైట్ MCLR : పాత రేటు - 7.50 శాతం; కొత్త రేటు - 7.70 శాతం
ఒక నెల MCLR : పాత రేటు - 7.55 శాతం; కొత్త రేటు - 7.75 శాతం
మూడు నెలల MCLR : పాత రేటు - 7.60 శాతం; కొత్త రేటు - 7.80 శాతం
ఆరు నెలల MCLR : పాత రేటు - 7.70 శాతం; కొత్త రేటు 7.90 శాతం
ఒక సంవత్సరం MCLR : పాత రేటు - 7.85 శాతం; కొత్త రేటు 8.05 శాతం
రెండేళ్ల MCLR : పాత రేటు - 7.95 శాతం; కొత్త రేటు 8.15 శాతం
మూడేళ్ల MCLR : పాత రేటు - 8.05 శాతం; కొత్త రేటు 8.25 శాతం
హోమ్ లోన్, కార్ లోన్ EMIలు పెరుగుతాయా..?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ రేటు పెంపు ఫలితంగా.. ఈఎంఐలు పెరగడంతో హౌసింగ్, వాహనాలు, వ్యక్తిగత రుణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే.. ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ తీసుకున్నవారు తమ రుణాల రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే EMI సవరించబడుతుందని గమనించాలి. రీసెట్ తేదీ వచ్చినప్పుడు ప్రస్తుత MCLR ఆధారంగా రుణదాత రుణగ్రహీతల గృహ రుణాలపై వడ్డీ రేటును పెంచుతారు లేదా సవరిస్తారు. అంటే.. ఒక వ్యక్తి హోమ్ లోన్ MCLR ఆధారంగా ఉంటే.. అతని రీసెట్ తేదీ సెప్టెంబర్‌లో ఉందనుకుంటే అప్పటి నుంచి పెరిగిన ఈఎంఐ అమలులోకి వస్తుంది.


Click it and Unblock the Notifications