దేశీయ అతిపెద్ద ప్రయివేటురంగ HDFC బ్యాంకు నిధుల వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR) అన్ని కాలపరిమితుల రుణాలపై 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మంగళవారం నుండి ఈ కొత్త రుణ వడ్డీ రేట్లు అమలు అవుతాయని HDFC బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. సవరించిన వడ్డీ రేటు ప్రకారం బ్యాంకు రుణ రేట్లు 7.50 శాతం నుండి 8.05 శాతం మధ్య ఉంటున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆధారంగా నెలవారీగా రుణ రేట్లను సవరించాలని ఆర్బీఐ సూచించిన మేరకు HDFC బ్యాంకు రేట్లను సవరించింది.
క్రితం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశ సమీక్ష అనంతరం HDFC బ్యాంకు ఎంసీఎల్ఆర్ను 60 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. మే ప్రారంభంలోనే 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆ తర్వాత గత నెలలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన అనంతరం మరో 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమావేశం నేపథ్యంలో రేపు, కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పెంచింది.

సవరించిన వడ్డీ రేటు ప్రకారం ఓవర్ నైట్ వడ్డీ రేటు 7.50 శాతం, ఒక నెల 7.55 శాతం, మూడు నెలలు 7.60 శాతం, ఆరు నెలలు 7.70 శాతం, ఒక సంవత్సరం 7.85 శాతం, రెండేళ్లు 7.95 శాతం, మూడేళ్లు 8.05 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications