దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ నిర్ణయంతో రుణగ్రహీతలు ఈఎంఐని పెంచాల్సిన వస్తోంది. HDFC బ్యాంక్ MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు)ని 15 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్ల పెంపుదల జూలై 7, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఓవర్‌నైట్ ఎమ్‌సిఎల్‌ఆర్ 15 బేసిస్ పాయింట్లు పెరిగి 8.25 శాతానికి చేరుకుంది. అంతకుముందు 8.10 శాతంగా ఉంది.
ఒక నెల MCLR 10 బేసిస్ పాయింట్ల పెంపుతో 8.20 శాతం నుంచి 8.30 శాతానికి పెరిగింది. మూడు నెలల రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.60 శాతానికి చేర్చింది. ఆరు నెలల రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచి 8.90 శాతానికి పెంచింది. ఒక సంవత్సరం పైబడిన రుణాల MCLRలో ఎటువంటి మార్పు లేదు. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్ ప్రస్తుతం 9.05 శాతంగా ఉంది. ఎమ్‌సిఎల్‌ఆర్‌ను పెంచుతూ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకున్న నిర్ణయం గృహ రుణ వడ్డీ రేట్లను ప్రభావితం చేయదని బ్యాంక్ తెలిపింది.

MCLR ఆధారంగా పాత వ్యక్తిగత రుణాలు, ఫ్లోటింగ్ ఆటో రుణాలు మాత్రమే వడ్డీ రేటుపై ప్రభావం చూపుతాయి. బ్యాంకుల గృహ రుణాలు రెపో రేటుతో అనుసంధానించి ఉంటాయి. ఎంసీఎల్‌ఆర్‌ను పెంచుతూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే గత రెండు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆగస్టులో జరిగే పాలసీ సమావేశంలో కూడా ఆర్‌బీఐ పాలసీ రేట్లను ప్రస్తుత ధరల ప్రకారం కొనసాగించగలదని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications