RBI News: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పటకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుంచి ఒక వార్త మాత్రం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపుతోంది. బ్యాంక్ నిర్ణయానికి రిజర్వు బ్యాంక్ ఆమోదం కూడా రావటంతో మరో రెండు కంపెనీల షేర్లు భారీగా లాభపడనున్నాయి.
వివరాల్లోకి వెళితే దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ కంపెనీల్లో అదనంగా 9.5 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆర్బీఐ అనుమతి లభించింది. వాటాలను కొనుగోలు చేయడానికి ఆమోదం హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా పెట్టుబడుల కోసం ఉద్దేశించబడింది. ప్రస్తుతం పొందిన ఆమోదం ఏడాది వరకు చెల్లుబాటులో ఉండనుంది. ఆ తర్వాత రద్దవుతుంది.

RBI ఆమోదం అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, జనవరి 16, 2023 నాటి బ్యాంకింగ్ కంపెనీలలో షేర్లు లేదా ఓటింగ్ హక్కులను పొందడం, హోల్డింగ్ చేయడంపై RBI మాస్టర్ డైరెక్షన్ & మార్గదర్శకాలు, ఫెమా, సెబీ నిబంధనలకు లోబడి ఉంటుంది. రిజర్వు బ్యాంక్ ఆమోదం ప్రకారం ఇకపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ ఇండస్ఇండ్ లో మెుత్తంగా 9.5 శాతం వాటాలకు మించకుండా ఎల్లప్పుడూ చూసుకోవాల్సి ఉంటుంది.
హోల్డింగ్ సరళి ప్రకారం ప్రమోటర్లు ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఇండస్ఇండ్ లిమిటెడ్ కలిసి బ్యాంకులో 16.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిసెంబర్ 2023 నాటికి మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్‌లో కలిపి 15.63 శాతం వాటాను కలిగి ఉండగా, ఎల్‌ఐసితో సహా బీమా కంపెనీలు 7.04 శాతం వాటాను కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికం నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కలిసి 38.24 శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు.
ఇదే క్రమంలో యెస్ బ్యాంక్ హోల్డింగ్ విధానం ప్రకారం 100 శాతం వాటాలు ప్రజల వద్ద ఉన్నాయి. రుణదాతల్లో ఎల్ఐసీతో 4.34 శాత వాటా కలిగి ఉండగా.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ కన్సార్టియం 37.23 శాతం వాటాను కలిగి ఉంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications