వాహనాల లోన్ కేసులో HDFC బ్యాంకుకు రూ.10 కోట్ల జరిమానా

ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. కారు లోన్ కేసులో ఈ దిగ్గజ బ్యాంకుకు ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఒక విజిల్ బ్లోయ‌ర్ ఫిర్యాదు మేరకు, క్షుణ్ణంగా ప‌రిశీలించిన అనంతరం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

రెగ్యుల‌రేట‌రీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌డంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఈ పరిశీలనలో తేలినట్లుగా తెలుస్తోంది. కారు రుణాల పోర్ట్‌ఫోలియోలో HDFC బ్యాంకు నిబంధ‌న‌లు పాటించలేదని ఆరోపణ. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం 1949లోని 6(2), 8 సెక్ష‌న్ల ప్ర‌కారం HDFCపై ఈ పెనాల్టీ విధించిన‌ట్లు RBI తెలిపింది.

HDFC Bank fined Rs 10 crore by RBI in car loan case

ఖాతాదారుల‌కు థ‌ర్డ్ పార్టీ ఆర్థికేత‌ర ఉత్ప‌త్తుల మార్కెటింగ్, విక్ర‌యానికి సంబంధించిన ప‌త్రాల‌ను ప‌రిశీలించాక త‌నిఖీ చేశాక ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. HDFC బ్యాంకు వివరణ తర్వాత పెనాల్టీ విధించాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+