HDFC News: అధికార పొగరు చూపిస్తే ఉద్యోగం ఇలానే ఊడిపోద్ది.. వైరల్ వీడియో..
HDFC News: ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు అనేక ఒత్తిళ్లు ఉంటాయి. ఇందులో ప్రధానమైనది కంపెనీ ఇచ్చే టార్గెట్లను చేరుకోవటం. అయితే ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైనప్పుడు ఎలా ఉంటుందనేది ఈ వీడియో అద్దం పడుతోంది.
తాజాగా వైరల్ గా మారిన ఒక వీడియో ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్ సమావేశానికి సంబంధించింది. అందులో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పల్ రాయ్ తన తోటి ఉద్యోగులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో సహోద్యోగులు వ్యాపార టార్గెట్లను అందుకోలేకపోయారు. దీంతో పుష్పల్ రాయ్ పని స్థితి, లక్ష్యాన్ని చూపుతూ బెంగాలీలో ఉద్యోగులను వెక్కిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.

ఈ ఆన్‌లైన్ వీడియో సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పల్ పదేపదే వారి నోరు మూసుకోండంటూ ఘాటైన స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఒక ఉద్యోగిని దుర్బాషలాడాడు. రోజుకు కనీసం 75 ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించలేకపోటంపై ఉద్యోగులను తిట్టినట్లు వార్తా సంస్థల్లో వచ్చిన నివేదికలు వెల్లడించాయి.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పుష్పల్ రాయ్‌ను సస్పెండ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంది. ప్రాథమిక విచారణ ఆధారంగా సంబంధిత ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో పాటు బ్యాంకు మార్గదర్శకాల మేరకు విచారణ కొనసాగుతోందని తెలిపింది. కార్యాలయంలో ఎలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడినా ఉపేక్షించేది లేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఉద్యోగులందరికీ సమా గౌరవంగా చూడాలని దృఢంగా విశ్వసిస్తుందని బ్యాంక్ జోడించింది.


Click it and Unblock the Notifications