కస్టమర్లకు HDFC బ్యాంకు గుడ్‌న్యూస్, రుణాలు మరింత చౌక
దేశీయ అతిపెద్ద ప్రయివేటురంగ బ్యాంకు HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ వడ్డీ రేట్లు కూడా శుక్రవారం నాటి నుండే (ఆగస్ట్ 7, 2020) నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. HDFC బ్యాంకు గత నెల కూడా అన్ని లోన్ కాల పరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

HDFC వడ్డీ రేట్ల తగ్గింపు ఇలా..
తాజా తగ్గింపు తర్వాత ఆగస్ట్ 7 నుండి ఎంసీఎల్ఆర్ రేట్లు ఇలా ఉంటాయి..
- ఓవర్ నైట్ - 7.1 శాతం నుండి 7 శాతానికి తగ్గింది.
- ఒక నెల - 7.15 శాతం నుండి 7.05 శాతానికి తగ్గింది
- 3 నెలలు - 7.2 శాతం నుండి 7.1 శాతానికి తగ్గింది.
- 6 నెలల నెలలు - 7.3 శాతం నుండి 7.2 శాతానికి తగ్గింది.
- ఒక సంవత్సరం - 7.35 శాతం నుండి 7.45 శాతానికి తగ్గింది.
- రెండేళ్లు - 7.45 శాతం నుండి 7.55 శాతానికి తగ్గింది.
- మూడేళ్లు - 7.55 శాతం నుండి 7.65 శాతానికి తగ్గింది.

IOB బేస్ రేటు కోత
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బేస్ రేటును పది బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 9.45 శాతం నుండి 9.35 శాతానికి పరిమితం కానుంది. బ్యాంకుకు చెందిన అసెట్ లయబిలిటీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన బేస్ రేటు సోమవారం నుండి అమల్లోకి వస్తుంది. ఎంసీఎల్ఆర్‌ను ఓవర్ నైట్ 7.30 శాతం నుండి 7.20 శాతానికి, ఏడాది కాల పరిమితి 7.75 శాతం నుండి 7.65 శాతానికి తగ్గుతుంది.

అంతకుముందు కెనరా బ్యాంకు కూడా..
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి తగ్గించలేదు. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే కెనరా బ్యాంకు 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించింది.
కెనరా బ్యాంకు నెల రోజల కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 7.20శాతం నుంచి 7శాతానికి, మూడు నెలల కాలపరిమితి రుణాలపై 7.45 శాతం నుంచి 7.15 శాతానికి, 6 నెలల కాలపరిమితి రుణాలపై 7.5 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీ రేటును 7.55 శాతం నుంచి 7.45 శాతానికి పరిమితం చేసింది. తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 7, శుక్రవారం నుండి అమలులోకి వస్తాయని తెలిపింది.


Click it and Unblock the Notifications