ప్రయివేటురంగ బ్యాంకు HDFC తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. మీ పాన్ కార్డు సమాచారం అప్ డేట్ కోసం మీకు పంపిన సందేశం లేదా ఈ మెయిల్ క్లిక్ చేయమని ఫ్రాడ్‌స్టర్స్ కోరుతారని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, క్లిక్ చేయవద్దని బ్యాంకు తన కస్టమర్లకు సూచించింది. పాన్ కార్డు వివరాలు అప్ డేట్ చేయాలని కోరుతూ మీకు వచ్చే గుర్తు తెలియని లింక్స్ పైన క్లిక్ చేయవద్దని కోరుతూ, గో డిజిటల్ గో సెక్యూర్ అని సూచించింది.
బ్యాంకు వెబ్ సైట్ లేదా ఏదైనా ఈ-కామర్స్ వెబ్ సైట్ లేదా సెర్చ్ ఇంజిన్ ద్వారా బ్యాంకు వెబ్ సైట్ మాదిరి థర్డ్ పార్టీ షిపింగ్ వెబ్ సైట్‌ను సృష్టించి బ్యాంకుల ఖాతాదారులను తప్పుదోవ పట్టిస్తారని HDFC బ్యాంకు హెచ్చరించింది. సోషల్ మీడియా, ఎస్సెమ్మెస్, ఇన్‌స్టాంట్ మెసెంజర్ ద్వారా ఈ వెబ్ సైట్స్ లింక్స్‌ను ఫ్రాడ్ స్టర్స్ సర్క్యూట్ చేస్తారు.

పలువురు కస్టమర్లు డిటైల్డ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ తెలుసుకోకుండా ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్, పాస్ వర్డ్ వంటి సెక్యూర్డ్ క్రెడెన్షియల్స్ నమోదు చేస్తారు. వీటిని ఫ్రాడ్ స్టర్స్ క్యాచ్ చేసుకుంటారు. దీంతో బ్యాంకులోని ఖాతాదారుల సొమ్మును కొట్టేస్తారు. గుర్తు తెలియని, ధృవీకరించని లింక్స్ పైన క్లిక్ చేయవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే సందేశాలు, ఈ-మెయిల్స్‌ను తక్షణమే తొలగించాలని, అన్-సబ్‌స్క్రైబ్డ్ ఈ-మెయిల్స్ పంపించే బ్యాంకు లేదా ఈ-కామర్స్ లేదా సెర్చింజన్ లింక్స్‌ను డిలీట్ చేయడంతో పాటు ఈ-మెయిల్స్‌ను బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications