మీరు HDFC బ్యాంకు కస్టమరా? మీ వద్ద క్రెడిట్ కార్డ్ ఉందా? నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారా? అయితే మీకో ముఖ్యమైన అలర్ట్. మరో రెండు రోజుల్లో బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. ఆ రోజు HDFC బ్యాంకు పలు సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఈ మేరకు బ్యాంకు హెచ్చరిక జారీ చేసింది.

సేవలకు అంతరాయం
HDFC బ్యాంకు కొన్ని సేవలకు జనవరి 18 (శనివారం) అంతరాయం కలగనుంది. IVRలో క్రెడిట్ కార్డు సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది.

దాదాపు 11 గంటలు
పై సేవలు కూడా శనివారం ఉదయం గం.1.00 నుంచి మధ్యాహ్నం గం.12.00 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. అంటే దాదాపు 11 గంటల పాటు సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

కారణమిదే
ఈ మేరకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అలర్ట్ వచ్చింది. ఈ కారణం వల్లే బ్యాంకుకు సంబంధించి పలు సేవలు అందుబాటులో ఉండవని HDFC బ్యాంకు తెలిపింది. దీనికి సంబంధించి బ్యాంకు తన అధికారిక వెబ్ సైట్‌లోను సమాచారాన్ని ఉంచింది.

కస్టమర్లకు రొటీన్ హెచ్చరికలు
HDFC నిరంతరం తమ కస్టమర్లకు రొటీన్ హెచ్చరికలు పంపిస్తుంది. షెడ్యూల్ మెయింటెనెన్స్, భద్రతాపరమైన సూచనలు, హెచ్చరికలు పంపిస్తుంది. మీ పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దని ఇటీవల పలుమార్లు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

గత నెల రోజు రోజులు అంతరాయం
గత ఏడాది (2019) డిసెంబర్ నెలలో బ్యాంకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సర్వీసులకు టెక్నికల్ ఇష్యూల కారణంగా రెండు రోజులు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సేవలకు అంతరాయంలో ఇబ్బందులు తలెత్తకుండా మెయింటెనెన్స్ చేస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications