HDFC: భారీగా డివిడెండ్ ప్రకటించిన హెచ్‌డిఎఫ్‌సి..!
మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 21 శాతం వార్షిక వృద్ధితో రూ. 12,594.5 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో రూ. 298,733 నుంచి రూ. 34,552.8 కోట్లకు ఏకీకృత నికర ఆదాయంలో 20.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో పన్నుకు ముందు లాభం (PBT) రూ. 15,935.5 కోట్లుగా ఉంది. బ్యాంక్ రూ. 12,047.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది మార్చి 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో పోలిస్తే 19.8 శాతం ఎక్కువ.
మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII), లేదా సంపాదించిన వడ్డీ, చెల్లించిన వడ్డీ మధ్య వ్యత్యాసం 23.7 శాతం పెరిగి రూ. 18,872 కోట్ల నుంచి రూ. 23,351 కోట్లకు చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. HDFC బ్యాంక్ మార్చి త్రైమాసిక లాభాలలో 21.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి, 2023తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ ఆదాయం 21 శాతం పెరిగి రూ. 32,083.0 కోట్లకు చేరుకుంది. డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరిచింది.

మార్చి 31, 2023 నాటికి రూ. 1,883,395 కోట్లుగా ఉన్నాయని, ఇది మార్చి 31, 2022 కంటే దాదాపు 21 శాతం పెరిగిందన్నారు. ఇదిలా ఉండగా మార్చి 31, 2023 నాటికి మొత్తం అడ్వాన్సులు రూ. 1,600,586 కోట్లుకు చేరాయి. ఇది మార్చి 31, 2022 కంటే 16.9 శాతం ఎక్కువ. "దేశీయ రిటైల్ రుణాలు 20.8 శాతం, వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 29.8 శాతం, కార్పొరేట్, ఇతర టోకు రుణాలు 12.6 శాతం పెరిగాయి" అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు మార్చి 31, 2023 నాటికి స్థూల అడ్వాన్స్‌లలో 1.12 శాతంగా ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బోర్డు కూడా ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.


Click it and Unblock the Notifications