దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్‌డేట్‌లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం విత్ డ్రాయల్స్, లాకర్ ఛార్జీల వంటి మార్పులు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
HDFC బ్యాంక్ కొన్ని కీలక మార్పులు అమలు చేయనుంది. వీటిలో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా మరికొన్ని ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకునే ముందు ఈ వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

లోన్ తీసుకునే వారికి ఊరట (MCLR తగ్గింపు)
HDFC Bank తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) 10 బేసిస్ పాయింట్ల (0.10%) వరకు తగ్గించింది. మార్చి 7, 2026 నుండి ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఓవర్ నైట్, వన్ మంత్ MCLR రేట్లు 8.25 శాతం నుండి 8.15 శాతానికి తగ్గాయి. అలాగే ఒక సంవత్సరం MCLR రేటు 8.40 శాతం నుండి 8.35 శాతానికి తగ్గింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న పాత కస్టమర్ల EMI భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ
మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పొదుపు చేసే వారికి HDFC Bank తీపి కబురు అందించింది. 3 ఏళ్ల 1 రోజు నుండి 4 ఏళ్ల 7 నెలల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.40 శాతం నుండి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేటు ఏకంగా 7 శాతానికి చేరింది. సాధారణ కస్టమర్లకు ప్రస్తుతం 2.75% నుండి 6.50% వరకు.. సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 7% వరకు వడ్డీ లభిస్తుంది.
ATM విత్ డ్రాయల్స్, UPI నగదు సేకరణ
డిజిటల్ చెల్లింపులు పెరిగిన తరుణంలో బ్యాంక్ ఏటీఎం నిబంధనలను కఠినతరం చేసింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఏటీఎం వద్ద యూపీఐ (UPI) ద్వారా నగదు తీసుకుంటే దానిని కూడా నెలవారీ ఉచిత ఏటీఎం (ATM) లావాదేవీల పరిమితిలోనే లెక్కిస్తారు. ఒకవేళ ఉచిత పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలు.. వాటిపై వర్తించే పన్నులను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లాకర్ ఛార్జీల్లో మార్పులు
లాకర్ సౌకర్యం వాడుతున్న వారి కోసం బ్యాంక్ కొత్తగా 'మెట్రో ప్లస్' అనే కేటగిరీని ప్రవేశపెట్టింది. ప్రాంతాన్ని బట్టి (మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, రూరల్) , లాకర్ పరిమాణాన్ని బట్టి ఛార్జీలను సవరించింది. ఈ కొత్త లాకర్ ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. దీనిపై అదనంగా జీఎస్టీ కూడా వర్తిస్తుంది. మీ బ్రాంచ్ ఉండే ప్రాంతాన్ని బట్టి లాకర్ ఛార్జీలు మారే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్రాంచ్ ఏ కేటగిరీలోకి వస్తుందో తెలుసుకుంటే మంచిది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications