HDFC: రుణగ్రహీతలకు షాక్ ఇచ్చిన హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్.. వడ్డీ రేటు పెంపు..!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను సవరించింది. ఓవర్‌నైట్ (ఒక రోజు) రుణ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించగా మరికొన్ని కాలపరిమితులకు రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు మంగళవారం అంటే 2026 జూలై 7 నుంచి అమల్లోకి వచ్చాయి. వడ్డీ రేట్లను 5.25% వద్ద యథాతథంగా ఉంచాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తర్వాత గత నెలలో ఈ బ్యాంక్ వివిధ కాలపరిమితులకు MCLRను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ ఓవర్‌నైట్ రుణంపై MCLRను 8.10 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గించింది. ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, రెండేళ్ల కాలపరిమితి గల MCLR రేట్లు వరుసగా 8.05 శాతం, 8.20 శాతం, 8.35 శాతం, 8.55 శాతం వద్ద యథాతథంగా ఉన్నాయి. అయితే ఒక సంవత్సరం MCLRను 8.40 శాతం నుంచి 8.45 శాతానికి పెంచింది. అలాగే మూడేళ్ల MCLRను 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది. ఈ సవరణతో రుణ కాలపరిమితిని బట్టి హెచ్‎డీఎఫ్‎సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.05 శాతం నుంచి 8.70 శాతం మధ్య ఉండనుంది. ఒక సంవత్సరం లేదా మూడేళ్ల పరిమితితో లోన్లు తీసుకున్నవారి వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది.

HDFC

మీరు తదుపరి EMIలపై దీని ప్రభావాన్ని ఉండవచ్చు. అయితే మీ రుణం MCLRతో లింక్ అయి ఉంటేనే వడ్డీ పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల కాలక్రమేణా రుణ వ్యయాలు తగ్గుతాయి, అదే పెరిగితే నెలనెలా చెల్లించే వాయిదా పెరగవచ్చు. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, కనీస రుణ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఏర్పాటు చేసుకున్న అంతర్గత ప్రామాణిక రేటు. దీన్నీ ఏప్రిల్ 2016లో ప్రవేశపెట్టారు.

వడ్డీ రేటు బదిలీని మరింత పారదర్శకంగా, మార్కెట్‌కు అనుసంధానించే లక్ష్యంతో పాత బేస్ రేట్ విధానం స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. రుణదాతలు రుణాలపై తప్పనిసరిగా వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటును MCLR అంటారు. ఈ రేట్లలో ఏదైనా పెరుగుదల రుణగ్రహీతలకు EMI కూడా పెరుగుతుంది. కాగా బ్యాంక్ తన బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR)ను కూడా సంవత్సరానికి 17.20 శాతానికి తగ్గించింది. ఇది జూన్ 24 నుంచి అమలులోకి వచ్చింది.ఫిక్స్‌డ్ డిపాజిట్ల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధారణ కస్టమర్లకు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లు డిపాజిట్ కాలపరిమితిని బట్టి 3.25 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+