HDB Finance IPO: ఐపీవోల మార్కెట్లో రద్దీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో చిన్న కంపెనీల నుంచి ప్రస్తుతం పెద్ద సంస్థల వరకు తమ ఐపీవోలను ఫ్లోట్ చేస్తున్నాయి. కొన్ని నెలల కిందట రిజర్వు బ్యాంక్ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా అనేక ఫైనాన్స్ కంపెనీలు మార్కెట్లోకి తమ ఐపీవోలను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బంపర్ రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టడం మనం చూశాం.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది త్వరలో మార్కెట్లోకి రాబోతున్న నాన్-బ్యాంకింగ్ సంస్థ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో గురించే. వాస్తవానికి ఇది ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థ. రిజర్వు బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా అప్పర్ లేయర్ కేటగిరీ ఎన్బీఎఫ్సీ కేటగిరీలో ఉన్నందున సంస్థ ఐపీవోను మార్కెట్లోకి తీసుకురావాలని HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు ఆమోదించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.2,500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ సైతం ఉందని వెల్లడైంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 94.64 శాతం వాటాను కలిగి ఉంది. సమాచారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీవో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మార్చి 2025 నాటికి పెట్టుబడిదారుల కోసం ముందుకు వస్తుంది. ఈ ఇష్యూ కోసం బ్యాంకర్లను షార్ట్ లిస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, నోమురా వంటి విదేశీ బ్యాంకులు ICICI సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, IIFL వంటి దేశీయ ఆటగాళ్లతో పాటు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి.
తాజా ఐపీవో ప్రక్రియను పరిశీలిస్తే HDB ఫైనాన్స్ విలువ రూ.78,000-87,000 కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది. అలాగే ఈ ఐపీవోలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాను హోల్డ్ చేస్తున్న మెుత్తం వాటాలా 10-15 శాతం విక్రయించనున్నట్లు సమాచారం. తద్వారా బ్యాంక్ రూ.7,800-8,700 కోట్లను సమీకరించవచ్చు.వాస్తవానికి హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను జాబితా చేయాలనే నిర్ణయం బ్యాంకింగ్యేతర ఆర్థిక కంపెనీలకు షరతులతో కూడిన లిస్టింగ్‌ను తప్పనిసరి చేస్తూ అక్టోబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత వస్తోంది. ఇప్పటికే బజాజ్ హైసింగ్ ఫైనాన్స్ కూడా ఈ కారణంగానే మార్కెట్లోకి వచ్చింది.
ఈ వార్తల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు శుక్రవారం దాదాపు 2 శాతం పెరిగి రూ.1,742.15 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో షేరు ధర రూ.1,745కి చేరింది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,791.90గా ఉంది.


Click it and Unblock the Notifications