HCLTech News: బిలియన్ డాలర్ల డీల్ పట్టిన హెచ్‌సిఎల్ టెక్.. పూర్తి వివరాలు..
IT News: ప్రస్తుతం టెక్ కంపెనీలు ప్రాజెక్టులు మందగించటంతో ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కువ శాతం చిన్న ప్రాజెక్టులు రావటంతో ఇటీవల ఆదాయాలు, మార్జిన్లపై ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో లాభాలో సైతం మందగిస్తున్నాయి.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ టెక్నాలజీస్ అతిపెద్ద డీల్ సొంతం చేసుకుంది. తన గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌లకు మేనేజ్డ్ నెట్‌వర్క్ సేవలను అందించడం కోసం వెరిజోన్ బిజినెస్‌తో 2.1 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా ఉన్న దిగ్గజం ప్రకటన తర్వాత షేర్లు భారీగా లాభపడ్డాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ మెుత్తం వ్యాపార డీల్స్ విలువ 1.56 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. ఇది గతంలో కంటే తక్కువని కంపెనీ వెల్లడించింది. ఒప్పందం నవంబర్ 2023 నుంచి ప్రారంభమయ్యే తదుపరి ఆరు సంవత్సరాల్లో సానుకూల రాబడి ప్రభావాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు డీల్ గురించి వెల్లడించింది.
ఈ సహకారం కింద వెరిజోన్ నెట్‌వర్కింగ్ పవర్, సొల్యూషనింగ్ అండ్ స్కేల్, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్‌ల కోసం పెద్ద-స్థాయి వైర్‌లైన్ సర్వీస్ డెలివరీని అందించడానికి HCLTech మేనేజ్డ్ సర్వీస్ సామర్థ్యాలను కలిపి ఉంటాయి. దీనిని మెుత్తంగా వెరిజోన్ సంస్థ నాయకత్వం వహిస్తుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ డీల్ టెలికాం అండ్ టెక్నాలజీ విభాగాల క్రిందకు వస్తుంది. తాజా త్రైమాసికంలో ఇది మంచి బుకింగ్ అవుతుందని కంపెనీ ఆశిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ స్టాక్ ఎన్ఎస్ఈలో 3.76 శాతం పెరిగి రూ.1,177 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications