ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 22 లక్షల ప్యాకేజీ! HCL సంచలన నిర్ణయం!

ఐటీ రంగంలో ఉద్యోగం అంటే ఒకప్పుడు కేవలం రూ. 3 నుండి 4 లక్షల ప్రారంభ ప్యాకేజీ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ నైపుణ్యం కలిగిన యువతకు కంపెనీలు కనకవర్షం కురిపిస్తున్నాయి. దేశంలోని మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ (HCLTech) తాజాగా ప్రకటించిన శాలరీ హైక్స్ (salary hikes) ఇప్పుడు టెక్ సర్కిల్స్‌ లో హాట్ టాపిక్‌గా మారాయి. నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లకు ఏకంగా ఏడాదికి రూ. 18 లక్షల నుండి రూ. 22 లక్షల వరకు ప్యాకేజీ ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

HCLTech Salary Hikes For Freshers Elite Engineers Get Up To 22 Lakhs AI Specialization Jobs News

ఎవరికి ఈ 'ఎలైట్' ప్యాకేజీలు?

HCLTech కేవలం అందరికీ ఈ భారీ జీతాలను ఇవ్వడం లేదు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి అత్యాధునిక విభాగాల్లో పట్టున్న అభ్యర్థులను 'ఎలైట్ కేడర్' (Elite Cadre) గా గుర్తించి ఈ ఆఫర్లు ఇస్తోంది. సాధారణ ఉద్యోగులతో పోలిస్తే వీరికి 3 నుండి 4 రెట్లు ఎక్కువ జీతం ఇవ్వడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. అత్యుత్తమ టాలెంట్‌ ను ఆకర్షించడమేనని కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ తెలిపారు.

పోటీలో ఇన్ఫోసిస్ కూడా..

HCLTech మాత్రమే కాదు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) కూడా ఫ్రెషర్స్ జీతాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఇన్ఫోసిస్ స్పెషలైజ్డ్ రోల్స్ కోసం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ క్యాంపస్ డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే ఐటీ కంపెనీల మధ్య ఇప్పుడు 'టాలెంట్ వార్' మొదలైందని స్పష్టమవుతోంది. క్వాంటిటీ కంటే క్వాలిటీకే మొగ్గు చూపుతూ కేవలం 15-20 శాతం మందిని మాత్రమే ఈ ఎలైట్ కేటగిరీ కింద ఎంపిక చేసుకుంటున్నారు.

HCLTech నియామకాలు ఇలా..

డిసెంబర్ త్రైమాసికంలో HCLTech మొత్తం 2,852 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,032 మంది ఫ్రెషర్లను బోర్డులోకి తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది గతేడాది కంటే చాలా ఎక్కువ. అయితే కంపెనీ నికర లాభం స్వల్పంగా 11 శాతం తగ్గినా ఆదాయం మాత్రం 13.3 శాతం పెరిగి రూ. 33,872 కోట్లకు చేరుకుంది. అట్రిషన్ రేటు (ఉద్యోగులు మానేసే రేటు) కూడా గతంతో పోలిస్తే 12.4 శాతానికి తగ్గడం కంపెనీకి సానుకూల అంశం.

ఏదేమైనా టెక్ రంగంలో అడుగుపెట్టాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. సాధారణ కోడింగ్ మాత్రమే కాకుండా AI, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి స్పెషలైజ్డ్ రంగాల్లో నైపుణ్యం సాధిస్తే ప్రారంభంలోనే భారీ జీతాలు అలాగే తర్వాత శాలరీ హైక్స్ (salary hikes) పొందడం సాధ్యమేనని HCLTech తాజా నిర్ణయం నిరూపిస్తోంది. మీరు కూడా ఐటీ రంగంలో స్థిరపడాలనుకుంటే.. కేవలం డిగ్రీతో సరిపెట్టకుండా కొత్త టెక్నాలజీల పై పట్టు సాధించడం చాలా అవసరం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+