సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ హెచ్‌సిఎల్‌టెక్ ఉద్యోగులను వారానికి మూడు రోజులు కార్యాలయానికి రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఆఫీస్ కు వెళ్లకుంటే ఫిబ్రవరి 19 నుంచి క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా తన ఉద్యోగులను కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ జాబితాలో భారతదేశంలోని మూడవ అతిపెద్ద ఐటి కంపెనీ హెచ్‌సిఎల్‌టెక్ చేరింది.
వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని ఆదేశించింది. "అందరు DFS (డిజిటల్ ఫౌండేషన్ సేవలు) ఉద్యోగులు, వారి బ్యాండ్ తో సంబంధం లేకుండా వారానికి కనీసం మూడు రోజులు వారు పని చేస్తున్న HCLTech కార్యాలయాలకు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది" హెచ్‌సిఎల్‌టెక్ వికాస్ శర్మ, గ్లోబల్ హెడ్ - పీపుల్ ఫంక్షన్ DFS ఫిబ్రవరి 14 నాటి ఇమెయిల్‌లో చెప్పినట్లు
తెలుస్తోంది.

కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అనుసరిస్తుందన్నారు. ఇందులో ఉద్యోగులు వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుందని హెచ్‌సిఎల్‌టెక్ ప్రతినిధి తెలిపారు. "హెచ్‌ఆర్ సమావేశాలలో ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రిపోర్ట్ చేయకపోతే జీతం లేకుండా సెలవు ఇస్తామని మేనేజ్‌మెంట్ హెచ్చరిస్తోంది" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఉద్యోగి చెప్పారు.
ఉత్పాదకతను నిశితంగా పరిశీలిస్తున్నామని, కనీసం ఎనిమిది గంటల ల్యాప్‌టాప్ యాక్టివిటీని నిర్వహించాలని ఉద్యోగులను కోరినట్లు తెలుస్తోంది. హెచ్‌సిఎల్‌టెక్ సీనియర్ మేనేజర్లు, నాయకత్వ బృందం ఇప్పటికే హైబ్రిడ్ మోడ్‌కు మారిందని, వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వస్తున్నారని మెయిల్ లో వివరించారు. " ఈ మెయిల్ పేర్కొన్న అంశాలు ఫిబ్రవరి 19, 2024 నుంచి అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది.
డిసెంబర్ త్రైమాసికంలో, HCLTech నికర లాభంలో సంవత్సరానికి 6.23 శాతం (YoY) వృద్ధిని రూ. 4,351 కోట్లకు నమోదు చేసింది. ఇది టాప్-ఐదు భారతీయ IT కంపెనీలలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది.


Click it and Unblock the Notifications