ఐటీ దిగ్గజం HCL టెక్నాలజీస్ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. నిపుణులైన ఐటీ నిపుణులను కంపెనీలోనే అట్టిపెట్టుకునేందుకు సాఫ్టువేర్ కంపెనీలు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో పాటు సరికొత్త ఆఫర్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెంజ్ కారును ఆఫర్ చేయాలని ప్రతిపాదించింది. బోర్డు నుండి అనుమతి రాగానే ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు HCL చీఫ్ హెచ్ఆర్ వీవీ అప్పారావు తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌తో పాటు హెచ్‌సీఎల్ వంటి సంస్థలు ఇప్పటికే పదోన్నతులు, బోనస్‌లు ఇస్తున్నాయి. ప్రధానంగా నిపుణుల్ని అట్టిపెట్టుకునేందుకు ఐటీ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.

అందుకే మెర్సిడెజ్ బెంజ్ కారు
ప్రతిభావంతులకు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమతిగా పొందే అవకాశం కల్పించాలనుకుంటున్నామని, బోర్డ్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు వివి అప్పారావు తెలిపారు. 2013లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 50 మంది ప్రతిభావంతులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను అందించింది. జావా డెవలపర్ వంటి నిపుణులు కంపెనీ ఇస్తున్న వేతనాలకు దొరుకుతున్నప్పటికీ, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు లభించడం లేదన్నారు. FY22లో 22వేల కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు HCL టెక్నాలజీస్ ఇదివరకే తెలిపింది. ఈ సంస్థలో వలసల రేటు 11.8 శాతంగా ఉంది.

ఉద్యోగులకు ఆఫర్ల వెల్లువ
ఐటీ సంస్థలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో నిపుణులను అట్టిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొత్త ఉద్యోగులు ఎలా పని చేస్తారో తెలియదు. నైపుణ్యం తెలియదు. అందుకే పాతవారికే పెద్ద పీట వేస్తున్నాయి. అందుకే ప్రతిభావంతులకు హెచ్‌సీఎల్ టెక్ మెర్సిడెజ్ కారు ఇస్తామని ప్రకటించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వేతన పెంపు, బోనస్, ప్రమోషన్ ఇస్తామని చెబుతున్నాయి. అన్ని రంగాలు డిజిటలైజ్ దిశగా సాగుతున్నాయి.
కృత్రిమ మేధ, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీ నైపుణ్యం ఉన్న వారికి ఐటీ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. నిపుణులు వేరే సంస్థలకు వలస వెళ్లకుండా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకే వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ప్రతిభావంతుల స్థానాలను కొత్తవారితో భర్తీ చేయాలంటే 15 శాతం నుండి 20 శాతం అదనపు వ్యయమవుతోందని, దీనికంటే ఉన్న వారికే వేతనాలు పెంచితే వ్యయాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నాయి.

బోనస్, వేతన పెంపు
HCL ఆట్రిషన్ గత ఏడాది జూన్ త్రైమాసికంలో 9.9 శాతంగా ఉండగా, ఈ జూన్ త్రైమాసికానికి 11.8 శాతానికి పెరిగింది. ఇన్ఫోసిస్ ఆట్రిషన్ గత ఏడాది మొదటి త్రైమాసికంలో 10.9 కాగా, ఈసారి 13.9 శాతానికి పెరిగింది.
విప్రోలో 15.5 శాతానికి చేరుకుంది. వలసల రేటును నిరోధించేందుకు గత జూన్ త్రైమాసికంలో 10,000 మందికి పదోన్నతులు కల్పించినట్లు విప్రో సౌరబ్ గోవిల్ తెలిపారు. నైపుణ్యాల ఆధారంగా జూన్ త్రైమాసికంలో 10,000 మందికి పది నుండి ఇరవై శాతం బోనస్ అందించింది విప్రో. టీసీఎస్ కూడా ఆరు నెలల్లో రెండుసార్లు వేతనాలు పెంచింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications