IT News: మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను HCL టెక్నాలజీస్ 3 వేల 983 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో పోస్ట్ చేసిన 3 వేల 593 కోట్లతో పోలిస్తే, 11 శాతం పెరుగుదల నమోదుచేసినట్లు వెల్లడించింది. ఈ క్వార్టర్లో కంపెనీ కార్యకలాపాల ద్వారా ఆదాయం 18 శాతం పెరిగి 26 వేల 606 కోట్లకు చేరింది. క్రితం సంవత్సరంలో చూస్తే ఈ సంపాదన 22 వేల 597 కోట్లకు పరిమితమైంది. అయితే అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం నికర లాభం 4 వేల 96 కోట్ల నుంచి 3 శాతం మేర క్షీణించింది
మార్కెట్ వర్గాల అంచనాను మించి నికర లాభాన్ని HCL పోస్ట్ చేసింది. FY24కి గాను స్థిరమైన కరెన్సీ (CC) వద్ద దాని ఆదాయం 6-8 శాతం వరకు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. EBDIT మార్జిన్ గైడెన్స్ 18-19 శాతం మధ్య ఉంటుందని భావిస్తోంది. అయితే ఫలితాల ప్రకటనకు ముందు బుధవారం నాటికి NSEలో HCL టెక్ షేర్ల ట్రేడింగ్ 0.16 శాతం నష్టంతో రూ.1,037 వద్ద ముగిసింది.

ఇంతకు ముందటి త్రైమాసికాలతో పోలిస్తే నాల్గవ దానిలో స్థిరమైన కరెన్సీ రాబడి వృద్ధి 1.2 శాతం క్షీణించింది కానీ ఏడాదికేడాది 10 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఆదాయం సంవత్సరానికి 8 శాతం చొప్పున 3 వేల 235 మిలియన్ డాలర్లకు చేరుకుంది. విభాగాల వారీగా చూస్తే, సేవల ద్వారా రాబడి 11 శాతం YoY పెరిగింది. సాఫ్ట్ వేర్ రంగం నుంచి వచ్చే ఆదాయంలో 8.2 శాతం వృద్ధిని సాధించింది. వీటికితోడు డిజిటల్ ఆదాయం 17 శాతం పెరిగింది.
నోయిడాకు చెందిన ఈ IT కంపెనీ EBDIT 4 వేల 836 కోట్లు కాగా.. సంవత్సరానికి 19 శాతం చొప్పున రాణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ 13 పెద్ద డీల్స్ (సర్వీసెస్ - 10, సాఫ్ట్ వేర్ - 10) గెలుచుకుంది. వీటి మొత్తం కాంట్రాక్ట్ విలువ 2.07 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. గతేడాదితో కలిపి చూస్తే 8 శాతం వృద్ధి సాధించింది. అయితే మార్చి 2023తో ముగిసిన పూర్తి సంవత్సరానికి, కంపెనీ ఆదాయం 18 శాతం వృద్ధితో 1 లక్ష కోట్ల మార్కును దాటింది.
మంచి లాభాల మీద జోరుగా ఉన్న HCL టెక్, ఈక్విటీ షేరుకి 18 చొప్పున గురువారం మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా FY24 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి డివిడెండ్ కావడం విశేషం. దానికి సంబంధించి ఇప్పటికే రికార్డు తేదీని ఈనెల 28గా నిర్ణయించింది. పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో HCL టెక్ ఒకటి కావడం గమనార్హం.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications