ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సిఎల్ టెక్ తాజాగా మూడవ త్రైమాసిక ఆదాయాలు రూ. 4,591 కోట్లుగా సోమవారం ప్రకటించింది, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 4,350 కోట్లతో పోల్చితే 5.54 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.29,890 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎఫ్‌వై24 మూడో త్రైమాసికంలో నివేదించిన రూ.28,446 కోట్ల కంటే ఇది 5.08 శాతం ఎక్కువ. కంపెనీ బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీకి చెందిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2 చొప్పున నాల్గవ ఇంటర్మ్ డివిడెండ్‌ను రూ.18గా ప్రకటించింది. కంపెనీ పబ్లిక్ లిస్టింగ్‌లో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక్కో షేరుకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్‌ను అందించింది.
HCL టెక్ జనవరి 8న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో "కంపెనీ 31 డిసెంబర్ 2024తో ముగిసిన మూడవ త్రైమాసిక FY 2025 ఫలితాలను 13 జనవరి 2025 సోమవారం భారతీయ స్టాక్ మార్కెట్ల క్లోసింగ్ తర్వాత ప్రకటిస్తుంది. ఫలితాల ప్రకటన తర్వాత, HCL టెక్నాలజీస్ సీనియర్ మేనేజ్‌మెంట్ 7:30 pm ( IST )కి 60 నిమిషాల పాటు ఫలితాలను చర్చించడానికి ఆడియో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహిస్తుంది, తర్వాత వివరంగా క్వశన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది అని పేర్కొంది. ఈరోజు Q3 ఫలితాలకు ముందు హెచ్‌సిఎల్ టెక్ షేర్ ధర 1 శాతం కంటే ఎక్కువ పడిపోయి, ట్రేడింగ్ సెషన్‌లో చాలా వరకు ఫ్లాట్‌గా ఉన్న తర్వాత ఎన్‌ఎస్‌ఇలో రూ.1,975 వద్ద ముగిసింది.

HCLTech చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శివ్ వాలియా మాట్లాడుతూ, "HCLTech మరో బలమైన త్రైమాసికంలో రూ. 29,890 కోట్ల ఆదాయంతో (3.6% QoQ అండ్ 5.1% YYY) అందించింది. Q3 EBIT మార్జిన్లు 19.5% (93 bps QoQ) వద్ద వచ్చాయి. LTM రిటర్న్ ఆన్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ (ROIC) వృద్ధి పథాన్ని కొనసాగిస్తోంది ఇంకా కంపెనీకి 36.6% (385 bps YY), సేవలకు 44.7% (455 bps YYY) వద్ద ఉంది. ఇంకా ఇవి మా బ్యాలెన్స్ షీట్‌ను మరింత పటిష్టం చేసింది, ఈ త్రైమాసికంలో మా అత్యధిక క్యాష్ బ్యాలెన్స్ రూ. 27,707 కోట్లతో ముగియడంలో మాకు సహాయపడింది అని అన్నారు.


Click it and Unblock the Notifications