HCLTech: ఆ దెబ్బకు తగ్గిన హెచ్సీఎల్ లాభాలు.. జీతాల పెంపుపై సంచలన నిర్ణయం..
HCLTech Q1 Results: ప్రముఖ IT కంపెనీ అయిన HCL టెక్నాలజీస్ 2024 ఆర్థిక సంవత్సరం విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాలు నిరాశకు గురిచేశాయి. ఏడాది ప్రాతిపధికన నికర లాభం 7.6 శాతం పెరిగినప్పటికీ.. క్రమంగా 11.2 శాతం మేర తగ్గుదలను నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.3,782 కోట్లుగా నమోదవుతుందని నిపుణులు అంచనా వేసినప్పటికీ వాస్తవానికి రూ.3,534 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో రెవెన్యూ 12 శాతం పెరిగి రూ.26,296 కోట్లుగా నమోదైంది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో HCL టెక్నాలజీస్ మార్కెట్ డైనమిక్స్ తో పాటు అనేక సవాళ్లను ఎదుర్కొంది. కొనసాగుతున్న సవాళ్లతో పాటు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని HCL టెక్నాలజీస్ తన ఉద్యోగులకు జీతాల పెంపును వాయిదా వేయాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది.

వాయిదా వేసిన జీతాల పెంపులతో పాటు మొదటి త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ హెడ్‌కౌంట్ తగ్గింపు వ్యూహాన్ని అమలు చేసింది. అలాగే మారుతున్న వ్యాపార అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా శ్రామికశక్తిని ఆప్టిమైజ్ చేయడం ఈ వ్యూహంలో భాగంగా ఉంటుంది. ఇదే సమయంలో కంపెనీ రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించింది. ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి, వారి వృత్తిపరమైన అభివృద్ధిని పెంచడానికి అవకాశాలను అందిస్తోంది.
నికర ప్రాతిపదికన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,506 మేర క్షీణించింది. దీంతో ఉద్యోగుల సంఖ్య 2,23,438కి చేరుకుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి విజయకుమార్ వెల్లడించారు. అన్ని అట్రిషన్‌లను తిరిగి పూరించకూడదని మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం కారణంగా హెడ్‌కౌంట్ తగ్గిందని వెల్లడైంది. ఈ త్రైమాసికంలో ఐటీ మేజర్ 1,597 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications