IT News: దేశీయ టెక్ కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ శ్రేణిలో సత్తా చాటుతున్నాయి. TCS, ఇన్ఫోసిస్ లు అగ్ర సంస్థలుగా వెలుగొందుతుండగా.. తాజాగా HCL సైతం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినట్లు CEO విజయకుమార్ వెల్లడించారు. క్లయింట్లు, వినియోగదారులు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తాము అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు చెప్పారు.

ESG అమల్లో మంచి పనితీరు:
పర్యావరణ, సామాజిక, పాలన (ESG)లో బలమైన పనితీరు కనబరుస్తూ HCL రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పరిశోధన, రేటింగ్ ఏజెన్సీలచే మంచి గుర్తింపు పొందింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ఈ మేరకు కంపెనీ గురువారం ప్రకటించింది. కార్పొరేట్ సుస్థిరతను అమలు చేయడంలో సాధించిన గణనీయమైన పురోగతికి ఇది నిదర్శనమని పేర్కొంది.

MSCI గుడ్ రేటింగ్:
సాఫ్ట్‌వేర్ మరియు సేవల విభాగంలో HCLTechని ESG లీడర్ గా MSCI రేటింగ్ ఇచ్చింది. 8 వేల 5 వందల కంపెనీలు పరిశ్రమ ESGకి అనుగుణంగా ఉన్నాయా అని పరిశోధించి, రిస్క్‌లను బహిర్గతం చేసింది. నష్టాల నిర్వహణ సామర్థ్యాన్ని అంచనా వేసింది. లీడర్, యావరేజ్, లాగార్డ్ గా రేటింగ్ లను విభజించింది. కాగా ఈ ఏడాది AA రేటింగుతో HCL అగ్రగామి సంస్థగా గుర్తించబడింది. గతేడాది Aతో పోలిస్తే గణనీయమైన వృద్ధి సాధించినట్లు వెల్లడించింది.

పట్టం కట్టిన S&P:
HCLTechని ఇండస్ట్రీ మూవర్ గా S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్‌బుక్ 2023 గుర్తించింది. స్థిరమైన వ్యాపార పద్ధతులను ప్రదర్శించిన ప్రముఖ కంపెనీల జాబితాను ఈ సంస్థ నివేదిస్తుంది. 2023 ఎడిషన్ కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 61 పరిశ్రమల్లోని 7 వేల 8 వందల సంస్థలను S&P విశ్లేషించింది. కఠినమైన కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్కుపై దాని రేటింగ్ ఆధారపడి ఉంటుంది.

టాప్ రేటెడ్ జాబితాలోకి..
సాఫ్ట్‌వేర్ మరియు సేవల విభాగంలో.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 2023 టాప్ రేటెడ్ ESG కంపెవీల జాబితాలో HCLTech చేర్చబడింది. సంస్థ ESG పనితీరు ఆధారంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 వేల కంపెనీల్లో తక్కువ-రిస్క్ కేటగిరీలో ఉంచబడింది. 2040 నాటికి నికర-సున్నా ఉద్గారాలు, 2030 నాటికి సంపూర్ణ స్కోప్ 1 మరియు 2 ఉద్గారాలను 50 శాతం తగ్గించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే 2030 నాటికి 80 శాతం పునరుత్పాదక విద్యుత్ శక్తివైపు మారాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications