Hurun Philanthropy list: కార్పొరేట్ దిగ్గజాలుగా ఓ వైపు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తునే, దాతృత్వంతో తమ ఉదారతను చాటుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. వేలకోట్ల రూపాయలను విరాళాలుగా ఇస్తూ ఆపన్నులకు సాయం అందించే సహృదయులకు ఇండియాలో కొదువ లేదు. అంబానీ, అదానీలను వెనక్కు నెడుతూ మరో వ్యక్తి పరోపకారమే పరమావధిగా ముందుకు సాగుతున్నారు.
హురున్ ఇండియా దాతృత్వ జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో ప్రముఖ IT కంపెనీ HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. ఏకంగా 2 వేల 42 కోట్లను విరాళంగా ఇచ్చారు. కాగా గత ఐదేళ్లలో ఆయన టాప్ ప్లేస్ లో నిలవడం ఇది మూడోసారి కావడం విశేషం.

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 1,774 కోట్ల విరాళాలతో ఈ జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ 376 కోట్లు దానం చేసి దేశంలో మూడవ అతిపెద్ద దాతగా నిలిచారు. కుమార్ మంగళం బిర్లా 287 కోట్లతో నాలుగు, గౌతమ్ అదానీ 285 కోట్ల డొనేషన్స్ తో ఐదు స్థానాల్లో నిలిచి సమాజానికి తమ వంతు సాయం అందిస్తున్నారు.
విరాళాల పరంగా బజాజ్ కుటుంబం, వేదాంత సారధి అనిల్ అగర్వాల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ మరియు రోహిణి నీలేకని, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ మరియు అదార్ పూనావాలా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక సంపద పరంగా చూస్తే ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్న బిలియనీర్ గా నిలిచారు. అనంతరం రెండో స్థానంలో గౌతమ్ అదానీ, మూడో ప్లేస్ లో శివ్ నాడార్ కొనసాగుతున్నారు.
హురున్ ఇండియా MS అనస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దాతృత్వంలో రికార్డు నెలకొన్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో 100 కోట్లకు పైగా విరాళాలు అందజేసే దాతల సంఖ్య 2 నుంచి 14కి పెరగిందని తెలిపారు. 50 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చే వారు 5 నుంచి 24కి పెరిగినట్లు వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 దాతలు మొత్తం 3 వేల 34 కోట్లు విరాళాలు అందించగా.. 2023 నాటికి ఈ మొత్తం 5 వేల 806 కోట్లకు చేరినట్లు ప్రకటించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications