HCL News: హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. కంప్యూటర్ హార్డ్‌వేర్ తయారీదారు అయిన శివ్ నాడార్ నేతృత్వంలోని హెచ్‌సీఎల్ గ్రూప్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.
సెమీకండక్టర్ల కోసం ఒక అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్(ATMP) యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఆసక్తిగా ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సమర్పించేందుకు దగ్గరగా ఉంది. దీనికోసం 200-300 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తోందని సమాచారం.

గుజరాత్‌లోని సనంద్‌లో అవుట్‌సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) ప్లాంట్ ఏర్పాటుకు 825 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన మైక్రోన్ వంటి కంపెనీల సరసన హెచ్సీఎల్ చేరనుంది. యూనిట్‌లు సెమీకండక్టర్ తయారీ గొలుసులో OSAT, ATMP యూనిట్లు ముఖ్యమైనవి. ఎందుకంటే అవి సిలికాన్ చిప్‌లను పరీక్షించడంలో, ప్యాకింగ్ చేయడంలో సహాయపడతాయి.
10 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కింద హెచ్‌సిఎల్ గ్రూప్ దరఖాస్తు చేసుకోనుందని నివేదికలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద దేశంలో చిప్‌ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలు చేసే మూలధన వ్యయంలో 75% వరకు కేంద్ర, రాష్ట్ర సబ్సిడీలు అందుతాయి. ప్రపంచ స్థాయిలో ఇంటెల్ వంటి చిప్ తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తున్న హెచ్‌సీఎల్ తాజా చర్య చాలా వ్యూహాత్మకమైనదిగా తెలుస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications