నోయిడా బేస్డ్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్వార్టర్ 3 ఫలితాలను ప్రకటించింది. ఇయర్ టు ఇయర్ 16 శాతం వృద్ధిని, క్వార్టర్ టు క్వార్టర్ 14.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2019తో ముగిసిన Q3కు రూ.3,037 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.2,611గా నమోదయింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.2,651 కోట్లుగా నమోదయింది.
ఇయర్ టు ఇయర్ పరంగా 16.4 శాతం వృద్ధిని నమోదు చేశామని, 20.2 శాతం ఎబిట్ ఉందని, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో విజయ్ కుమార్ తెలిపారు. ప్రోడక్ట్స్, ప్లాట్ ఫామ్స్ సెగ్మెంట్ వృద్ధి72.8 శాతం పెరగగా, ఐటీ, బిజినెస్ సేవలు 10.4 శాతం, ఇంజినీరింగ్ అండ్ ఆర్ అండ్ డీ సేవలు 12.8 శాతం పెరిగింది.

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఎబిట్డా మార్జిన్ 24.7 శాతంగా, ఎబిట్ మార్జిన్ 20.2 శాతంగా నమోదయింది. కంపెనీ ఒక్కో షేర్ పైన రూ.2 డివిడెంట్ ప్రకటించింది. వరుసగా 68 క్వార్టర్ డివిడెండ్ ఇస్తోంది.
హెచ్‌సీఎల్ టెక్‌లో అమెరికాపై ఆధారపడటం క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది డిసెంబర్ క్వార్టర్‌లో యూఎస్ రెవెన్యూ 64.4 శాతం కాగా, ఈ ఏడాది తాజా క్వార్టర్ (డిసెంబర్)లో మాత్రం 62.8 శాతానికి తగ్గింది. అదే సమయంలో యూరోప్ రెవెన్యూ షేర్ గత ఏడాది 28.2 శాతం కాగా, ఈ ఏడాది 29.2 శాతానికి పెరిగింది. మిగతా ప్రపంచ దేశాల నుంచి రెవెన్యూ 8 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications