Vijayawada news: భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రముఖ IT కంపెనీ HCL శుభవార్త చెప్పింది. విద్యాభ్యాసం పూర్తిచేసి కొలువుల కోసం కాచుకుని కూర్చున్న వారికి తలుపులు తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడలో కొలువుదీరిన ఈ సంస్థ.. మళ్లీ ఆయన పాలనలోనే కీలక అప్‌డేట్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీని భారీ స్థాయిలో విస్తరించేందుకు HCL ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 15 వేల మంది IT నిపుణులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరికోసం కొత్త క్యాంపస్‌ను సైతం స్థాపించేందుకు సిద్ధంగా ఉంది. మొదటి ఫేజ్‌లో కనీసం 5 వేలు, రెండో విడతగా మరో 10 వేల మందికి అభ్యర్థులకు ఉపాధి కల్పించాలని కంపెనీ భావిస్తున్నట్లు ప్రకటించింది.

'మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తూ భారీ స్థాయిలో ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధిలో మేం భాగస్వాములం అవుతాం. రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మా వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని HCL కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ బృందం తెలిపింది.
ఈ మేరకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అవసరమైన సాయం అందించాలని AP IT శాఖ మంత్రి నారా లోకేష్‌కి విజ్ఞప్తి చేసినట్లు శివప్రసాద్ వెల్లడించారు. అయితే నూతనంగా నిర్మింపబడే కొత్త క్యాంపస్ అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను HCL చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ సంస్థ కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా రాష్ట్రంలోని యువతపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.
15 వేల ఉద్యోగాల కల్పన స్థానికి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫ్రెషర్స్, ఎంట్రీ స్థాయి జాబ్స్ మొదలుకుని మేనేజ్‌మెంట్ స్థానాల వరకు ప్రతిభావంతులైన నిపుణులకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. చాలా మంది యువ టెక్కీలకు IT రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఈ సువర్ణావకాశం వీలు కల్పిస్తుందని చెబుతున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications