న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇబ్బందుల నుండి బయటపడి కంపెనీ సానుకూలతల వైపు పయనిస్తోందని HCLటెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్నీనాడార్ మంగళవారం పేర్కొన్నారు. కంపెనీ 28వ వార్షిక సాధారణ సమావేశం(AGM)లో ఆమె మాట్లాడారు. చైర్మన్ బాధ్యతలు తీసుకున్న అనంతరం రోష్నీ నాడార్ మల్హోత్రా మొదటిసారి AGMను ఉద్దేశించి మాట్లాడారు. మౌలికం, సైబర్ భద్రత సేవలు, ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి విభాగాల్లో కంపెనీ వృద్ధిని నమోదు చేస్తున్నట్లు రోష్ని తెలిపారు. కరోనా నుండి బయటపడి డిమాండ్ స్థిరంగా ఉంటోందన్నారు. తగ్గిన ఆదాయాలు క్రమంగా పుంజుకుంటున్నట్లు చెప్పారు. హెచ్‌సీఎల్ దేశీయ మూడో అతిపెద్ద సాఫ్టువేర్ సంస్థల ఎగుమతి కంపెనీ.

దూసుకెళ్తున్నాం..
గత నాలుగు సంవత్సరాలుగా హెచ్‌సీఎల్ పరిశ్రమకు వృద్ధిని స్థిరంగా అందిస్తోందని రోష్నీ చెప్పారు. ప్రపంచ టాప్ 10 టెక్నాలజీ పరిశ్రమలను పరిశీలిస్తే గత నాలుగేళ్లలో అత్యధిక వృద్ధి, అత్యధిక సీఏజీఆర్‌ను కలిగి ఉన్న సంస్థల్లో హెచ్‌సీఎల్ ముందు ఉంటుందని, 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో అసాధారణ పనితీరును కనబరిచిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, టెలికం అండ్ మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాల్లో వ్యాపారం పెరుగుతున్నట్లు హెచ్‌సీఎల్ ఇటీవల తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధిరేటు స్థిర కరెన్సీలో 3.5 శాతం ఉండవచ్చునని, మార్జిన్ 20.5 శాతం నుండి 21 శాతం మధ్య ఉండవచ్చునని తెలిపింది.

ఈ అవకాశాలు ఉపయోగించుకుంటాం
బాహ్య వాతావరణంలో మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ సేవలు, ఈ-కామర్స్, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వంటి ఉత్పత్తులు, సేవలకు కొత్త డిమాండ్‌ను సృష్టించాయని రోష్నీ నాడార్ అన్నారు. రిటైల్ వ్యాపారులు ఇప్పుడు తమ ఈ-కామర్స్ మోడల్‌ను వేగవంతం చేస్తున్నారని చెప్పారు. అలాగే, వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యతను పెంచినట్లు తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి హెచ్‌సీఎల్ సిద్ధంగా ఉందన్నారు. గత అయిదేళ్ల కంటే రాబోయే అయిదేళ్లలో ఐటీ పరిశ్రమ వేగవంత వృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.

చివరి క్వార్టర్ తుడిచి పెట్టుకుపోయింది
2019-20 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్, టెలీ కమ్యూనికేషన్స్, మీడియా, పబ్లిషింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్, రిటైల్ అండ్ సీపీజీ, పబ్లిక్ సర్వీసెస్ పెరిగినట్లు తెలిపారు. అయితే చివరి త్రైమాసికంలో మాత్రం కరోనా కారణంగా తుడిచి పెట్టుకుపోయిందన్నారు. ఇది మనకు (హెచ్‌సీఎల్) నేర్చుకునే, పరీక్షా కాలమని రోష్ని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ముందుకు సాగుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త మార్గాలను ఎంచుకొని, అవకాశాలను సృష్టించుకుందామని తెలిపారు. మహమ్మారి వ్యాపార పని విధానాన్ని మార్చి వేసిందన్నారు. డిజిటల్ పరివర్తన మన వ్యాపార అజెండాను ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పెరిగిందని రోష్నీ తెలిపారు. మధురై, లక్నో వంటి చిన్న నగరాల్లో కేంద్రాల్ని ఏర్పాటు చేయడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగిందన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications