IT News: జర్మన్ కంపెనీని కొనుగోలు చేసిన HCL.. ఆటోమోటివ్ స్పేస్‌లో భారీ విస్తరణకు ప్లాన్
IT News: నోయిడా కేంద్రంగా దేశీయ టెక్ దిగ్గజం HCLTech సేవలందిస్తోంది. జూన్ తో ముగిసిన త్రైమాసికానికంలో కంపెనీ ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువగానే రిపోర్ట్ చేసింది. అయితే తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో గుడ్ న్యూస్ చెప్పింది. ఓ జర్మన్ కంపెనీని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది.
జర్మనీకి చెందిన ఆటోమోటివ్ ఇంజినీరింగ్ సేవల సంస్థ ASAP గ్రూప్‌ను HCLTech కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 251 మిలియన్ యూరోలు అని దేశీయ IT దిగ్గజం వెల్లడించింది. తద్వారా యూరప్, అమెరికా, జపాన్‌లోని ఆటోమోటివ్ మార్కెట్‌లో మరింత విస్తరించేందుకు HCLకు అవకాశం లభించినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

ASAP గ్రూప్ 2010లో స్థాపించబడింది. జర్మనీలో అగ్రశ్రేణి ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులతో పాటు టైర్-1 సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్ సర్వీసెస్, వెహికల్ డెవలప్‌మెంట్ సెగ్మెంట్లు దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల టెక్నాలజీ, టెలికాం రంగాలకు సంబంధించిన క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. దీని ప్రభావం భారత IT మార్కెట్‌పై పడింది. తద్వారా మార్కెట్ అంచనాలను అందుకోవడంలో HCL విఫలమైంది. గత త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 7.65 శాతం బలపడింది. కానీ విశ్లేషకులు 38.17 బిలియన్ల మేర ఊహించగా 35.34 బిలియన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications