Multibagger Stock: పెన్నీ స్టాక్స్ తో ఎంత ప్రమాదం ఉంటుందో అవి పేలితే అంతే భారీగా లాభాలను ఆర్జించి పెడతాయి. కేవలం వేలు పెట్టుబడి పెట్టిన వారిని కోటీశ్వరులుగా మార్చేస్తాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను తెచ్చిపెట్టిన పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గురించే. కేవలం మూడేళ్లలో స్టాక్ 16,000 శాతం వేగవంతమైన రాబడిని అందించింది. వాస్తవానికి కేవలం పైసల్లో ఉన్న షేర్ ధర ప్రస్తుతం ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చి అద్భుతాలు సృష్టిస్తోంది.

వాస్తవానికి మే 15, 2020న కంపెనీ ఒక్కో షేరు ధర కేవలం 84 పైసలుగా ఉంది. అయితే బుధవారం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి, అది రూ.137.60 వద్ద నిలిచింది. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ ఏకంగా రూ.1.6 కోట్లుగా మారి ఉండేది. అలాగే 2020లో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లలో రూ.63,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.కోటికి చేరుకుని ఉండేది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.208.87 కోట్లుగా ఉంది.
షేర్ ధర పెరుగుదలను పరిశీలిస్తే.. 15 మే 2020న ఒక షేరు ధర 84 పైసలు, 31 డిసెంబర్ 2020 నాటికి రూ.2.95కి చేరుకుంది. డిసెంబర్ 30, 2022న దీని ధర రూ.71.36 స్థాయికి పెరిగింది. 2023 ప్రారంభంతో బుల్ జోరుతో పెరుగుతూ షేరు ధర రూ.164ను తాకింది. గడచిన ఏడాది కాలంలో షేర్ ధర 57 శాతం పెరగగా.. 5 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లు 11,762.07 శాతం రాబడిని అందుకున్నారు. ఒకప్పుడు చిన్న పెన్నీ స్టాక్ గా ఉన్నప్పటికీ కంపెనీ పనితీరుతో స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించి ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చింది.


Click it and Unblock the Notifications