మీరు ఆరోగ్య బీమా తీసుకున్నారా? అయితే ఇలా చేస్తే మీకు ప్రయోజనం, సౌకర్యం

ఈ రోజుల్లో సోకుతున్న వ్యాధుల గురించి తలచుకుంటే భయమేస్తోంది కదా.. ఎక్కడో పుట్టిన వైరస్ లు చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలను హరించి వేస్తున్నాయి. కొంత మంది ఆయా వైరస్ ల బారిన పడి అస్పత్రుల పాలవుతున్నారు. మరికొంత మంది ఇతర వ్యాధులతో హాస్పిటళ్లలో చేరుతున్నారు. ఆపరేషన్లు, చికిత్సలు వంటివాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ ఖర్చుల భారం నుంచి తప్పించుకోవడానికి ఆరోగ్య బీమా ఎంతగానో దోహద పడుతుంది. అయితే బీమా తీసుకున్న వారు కొన్ని రకాల పనులు చేయడం వల్ల బీమా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండవచ్చు. ఆ వివరాలు మీ కోసం అందిస్తున్నాం. వేమిటంటే..

సాఫ్ట్ కాపీ లు అందుబాటులో ఉంచుకోండి..

సాఫ్ట్ కాపీ లు అందుబాటులో ఉంచుకోండి..

అనారోగ్యం కారణంగా మీరు ఎప్పుడైనా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రావచ్చు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేరే సమయంలో మీరు తీసుకున్న పాలసీ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డును హాస్పిటల్ సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు వారు హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకున్న తర్వాత మీకు క్యాష్ లెస్ వైద్య సేవలు అందించడం ప్రారంభిస్తారు. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా సంబంధిత బీమా కంపెనీ నుంచి నగదు రహిత చికిత్సకు అనుమతి తీసుకుంటారు. కాబట్టి మీ క్యాష్ లెస్ కార్డు తో పాటు మీ కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డుల కాపీలను మీ మొబైల్ ఫోన్ లో లేదా మీ మెయిల్ లో అందుబాటులో ఉంచుకోవడం మరచి పోవద్దు. ఇవి అందుబాటులో ఉండటం వల్ల ఎప్పుడంటే అప్పుడు మీరు ఆస్పత్రి సిబ్బందికి అందించే అవకాశం ఉంటుంది కదా. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు చాలా ఆందోళన ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు సంబంధించి న వివరాలు ఎప్పుడు మీ వెంట ఉండటం వల్ల మీకే ఇబ్బంది తగ్గుతుంది.

నెట్ వర్క్ హాస్పిటళ్ళ వివరాలు తెలుసుకోండి..

నెట్ వర్క్ హాస్పిటళ్ళ వివరాలు తెలుసుకోండి..

హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం రావద్దని అందరు భావిస్తారు. కానీ చెప్పలేము కదా. ఎప్పుడైనా ఏమైనా జరగ వచ్చు. దురదృష్ట వశాత్తు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే మీకు అందుబాటులో ఉన్న మంచి హాస్పిటల్ గురించి మీకు తెలిసి ఉండాలి. మీరు బీమా తీసుకున్న సమయంలో ఆ బీమా సంస్థ తాము నగదు రహిత సేవలు అందించడానికి సంబందించిన నెట్ వర్క్ హాస్పిటళ్ళ వివరాలు అందిస్తాయి. ఒక్కసారి ఆ హాస్పిటళ్ల జాబితా చూడండి. ఎమర్జెన్సీ సమయాల్లో వాటిలో చేరడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో వెతుక్కోవడంకన్నా ముందు జాగ్రత్త పడటం మంచిదే కదా..

మెడికల్ రికార్డులు దాచిపెట్టండి

మెడికల్ రికార్డులు దాచిపెట్టండి

ఆస్పత్రిలో చేరినప్పుడు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తారు. చికిత్స అందించిన సమయంలోను వాటి వివరాలు రికార్డుల్లో భద్రపరుస్తారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు వాటిని మంకు ఇస్తారు. వీటిని మీ వద్ద భద్ర పరచుకోండి. వీటి అవసరం ఎప్పుడైనా రావచ్చు. ఈ వివరాలు మీ బీమా కంపెని కొన్ని సందర్భాల్లో కోరవచ్చు. వీటిని అందిస్తే మీ క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.

మీ పాలసీ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయండి..

మీ పాలసీ గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయండి..

మీరు మీ కుటుంబానికి పెద్దగా ఉండి బీమా పాలసీ తీసుకున్న సందర్భంలో దానికి సంబంధించిన వివరాలకు మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఎంత మొత్తానికి పాలసీ తీసుకున్నది.. ఏయే వ్యాధులకు అది వర్తిస్తుంది అన్న వివరాలు తెలియజేయడం వల్ల వారికీ కూడా పాలసీ పై అవగాహన వస్తుంది. వారు కూడా బీమా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇతరులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంటాము. వాటిలో ఆరోగ్య బీమాను కూడా చేర్చడం వల్ల ప్రయోజనమే ఉంటుంది కదా.

ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి..

ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి..

వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కన్నా వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అందుకే వీలైనప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి చెకప్ చేయించుకోండి. ఏదైనా వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడే గుర్తిస్తే దానికి ముందుగానే చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది.

బీమా మొత్తాన్ని సమీక్షించుకోండి..

బీమా మొత్తాన్ని సమీక్షించుకోండి..

ఆస్పత్రిలో చేరినప్పుడు అయ్యే వ్యయాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మీరు తీసుకున్న బీమా మొత్తం సరిపోక పోవచ్చు. కాబట్టి మీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మీ బీమా మొత్తాన్ని పెంచుకోవాల్సి వస్తుందేమో ఒకసారి చూసుకోండి.

గత పాలసీల వివరాలు ఉంచుకోండి..

గత పాలసీల వివరాలు ఉంచుకోండి..

మీ పాలసీ గడువు ముగిసిన తర్వాత ఆ పాలసీ వివరాలు ఎందుకులే అనుకుంటారు చాలా మంది. కాబట్టి దానికి సంబందించిన కార్డులను ఎక్కడో పడేస్తారు. కానీ వాటిని భద్ర పరచుకోవడం మంచిది. మీరు వేరే బీమా కంపెనీకి మారాలన్న లేదా క్లెయిమ్ సందర్భంలో వాటి గురించి అడగవచ్చు. అప్పుడు వాటి వివరాలు పొందడం ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందటి పాలసీల కాపీలను మీ వద్ద భద్రపర్చుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+