రేషన్ కార్డు ద్వారా ఫ్రీగా లేదా తక్కువ ధరకు రేషన్ పొందడమే కాకుండా మీ గుర్తింపుకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ప్రభుత్వ పథకాలు లేదా కొన్ని ముఖ్యమైన పనులకు రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. పేద, నిరుపేద ఇంకా అర్హులైన మధ్య తరగతి ప్రజలకి ప్రభుత్వం అందించే పథకాల లబ్ది పొందేందుకు ఈ రేషన్ కార్డు తప్పనిసరి. తాజగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభించిన సంగతి మీకు తెల్సిందే. అయితే మీరు కూడా రేషన్ కార్డు కోసం అప్లయ్ చేసుకుని ఉంటే, మీ కార్డ్ ప్రస్తుత స్టేటస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.... అయితే కేవలం ఇంట్లో కూర్చొని కూడా ఆన్‌లైన్ ద్వారా మీ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

రేషన్ కార్డు స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి అంటే : రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేయడానికి మీరు ప్రభుత్వ వెబ్‌సైట్ NFSA (జాతీయ ఆహార భద్రతా అథారిటీ పోర్టల్) లో చూడవచ్చు. ఇలా కాకుండా మీరు రాష్ట్ర ప్రత్యేక వెబ్‌సైట్ ఓపెన్ చేయడం ద్వారా కూడా చెక్ చేయవచ్చు. దీనితో పాటు మీరు అందించిన సమాచారంలో ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా మీరు వాటికీ సవరించవచ్చు.
చెక్ చేసుకునే ప్రక్రియ
స్టెప్ 1- ముందుగా మీరు జాతీయ ఆహార భద్రతా అథారిటీ పోర్టల్‌కి ఓపెన్ చేయాలి.
స్టెప్ 2- దీని తర్వాత మీకు ఇక్కడ సిటిజన్ అనే ఆప్షన్ చూపిస్తుంది.
స్టెప్ 3- దానిపై క్లిక్ చేసి, మీ రేషన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడానికి 'know my ration card status' పై నొక్కండి.
స్టెప్ 4- దీని తర్వాత మీ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ అనే సింబల్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5- తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, గెట్ ఆర్‌సి డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలను స్క్రీన్‌పై చూపిస్తుంది.
ఇలా కాకుండా మీరు ఏదైనా రాష్ట్ర వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం ద్వారా రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఎం చేయాలంటే...
స్టెప్ 1- ముందుగా మీరు ఫుడ్, సివిల్ సప్లయిస్ & కన్స్యూమర్ అఫైర్స్ సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 2- ఇక్కడ మీరు సర్వీస్ అప్షన్ చూస్తారు.
స్టెప్ 3- ఇప్పుడు రేషన్ కార్డ్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4- తరువాత రేషన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 5- దీని తర్వాత మీరు స్క్రీన్‌పైనే రేషన్ కార్డ్ స్టేటస్ చూస్తారు.
మీరు రేషన్ కార్డ్ స్టేటస్ ఆఫ్‌లైన్‌లో కూడా చెక్ చేయవచ్చు. దీని కోసం మీరు సమీపంలోని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అడగవచ్చు. వీటిలో రాష్ట్ర ఫుడ్, సివిల్ సప్లయిస్ & కన్స్యూమర్ అఫైర్స్ ఆఫీస్, సాధారణ సర్వీస్ సెంటర్ ఇంకా ఈ-సేవా వంటివి ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications