చెన్నైకి చెందిన పాలు, పాల ఉత్పత్తుల కంపెనీ హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్ (HAP) తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతుంది. అక్టోబర్ 2020 నాటికి ఈ కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌ను ఇక్కడ నిర్మించనుంది.

500 మందికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌పూర్‌లో రూ.207 కోట్ల పెట్టుబడితో హ్యాట్సన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ డెయిరీ ఉత్పత్తుల ప్లాంట్ ద్వారా చుట్టుపక్కల 4,000 మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరనుందని హ్యాట్సన్ తన ప్రకటనలో తెలిపింది.

ఉత్పత్తి.. మార్కెటింగ్
హ్యాట్సన్ ఆగ్రో ప్రోడక్ట్స్ కుకింగ్, కన్సంప్షన్ ప్రోడక్ట్స్‌ను తయారు చేసి, మార్కెట్ చేస్తోంది. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్స్, డెయిరీ వైట్‌నర్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, ఘీ, పన్నీరు వంటి వాటిని తయారు చేస్తోంది. ప్లాంట్ పనులు వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్ నాటికి ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపింది.

విదేశాలకు ఎగుమతి
హ్యాట్సన్ కంపెనీ అరుణ్ ఐస్‌క్రీమ్, ఆరోక్య మిల్క్, ఐబాకో ఐస్‌క్రీమ్స్, ఓయాలో, అనీవా, సంటోసా బ్రాండ్లతో పాలు, పెరుగు, ఐస్‌క్రీమ్స్, నెయ్యి, పన్నీర్ వంటి అన్ని రకాల పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉంది. వీటిని భారత్‌తో విక్రయించడంతో పాటు అమెరికా, మధ్యప్రాచ్యం వంటి 38 దేశాలకు ఎగుమతి చేస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications